గోదావరి.. ఎడారి | - | Sakshi
Sakshi News home page

గోదావరి.. ఎడారి

Sep 22 2026 12:24 AM | Updated on Sep 22 2026 12:24 AM

● నదిలో చుక్కనీరు కనిపించని వైనం ● గణేశ్‌ నిమజ్జనానికి ఎల్‌నినో గండం

రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన గోదావ రి నది ఏడారిని తలపిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక, ప్రాజెక్టులోకి నీరురాక ఈ పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. చివరిరోజు విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు నదిలో నీరులేకపోవడం భక్తులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఎగువ నుంచి నీటిని విడుదల చేస్తే తప్ప ఈసారి విగ్రహాల నిమజ్జనానికి సమస్యలు తప్పేలా లేవని వాపోతున్నారు.

ఎల్లంపల్లిలో 18.50 టీఎంసీల నిల్వ

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో బుధవారం గోదావరిలోనే అత్యధికంగా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ప్రాజెక్టులో 18.50 టీఎంసీల నీ రు మాత్రమే నిల్వ ఉంది. ఎగువ నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లో వస్తుంది. గతేడాది ఇదేరోజు భారీగా వరద రావడంతో ప్రాజెక్టు పది గేట్లు ఎత్తి 1.50 లక్షల క్యూ సెక్కులను దిగువకు వదిలారు. ఈసారి ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలితేనే వినాయక విగ్రహాల నిమజ్జనం సాఫీగా సాగుతుందని భక్తులు ఆశిస్తున్నారు. ఇందుకోసం నీటిపారుదల అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

రామగుండం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు

ప్రాంతం 2025 2026

అంతర్గాం 63 60

రామగుండం 45 61

ఎన్టీపీసీ 122 126

గోదావరిఖని 475 470

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement