ధర్మారం: బీఆర్‌ఎస్ హయాంలో చోటుచేసుకున్న అవినీతి చిట్టా బయటపెట్టి మాజీ సీఎం కేసీఆర్‌తోపాటు మాజీమంత్రులను ప్రజల ముందు దోషు లుగా నిలబెడతామని సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని వినాయక మండపాలను ఆయన సోమవారం సందర్శించి గ ణపతికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, గత పాలనలోని అవినీతిని అ సెంబ్లీ సాక్షిగా సీఎం రెవంత్‌రెడ్డి బయటపెట్టారన్నా రు. పదేళ్లపాటు అవినీతికి పాల్పడిన బీఆర్‌ఎస్ నాయకులు ప్రజాప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు.
నిమజ్జనం సందర్భంగా జాగ్రత్తలు తీసుకోవాలి
గణేశ్ నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఇబ్బందు లు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి లక్ష్మణ్‌కుమార్ సూచించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లావుడ్య రూప్లానాయక్, డీసీసీ ప్ర ధానకార్యదర్శి గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, నాయకులు చింతల ప్రదీప్‌రెడ్డి, కోడా రి అంజన్న, దాగేటి ఉదయ్‌కుమార్ యాదవ్, కాడే సూర్యనారాయణ, పాలకుర్తి రాజేశంగౌడ్, రేణికాదేవి, ఓరం చిరంజీవి, కల్లెం గంగారెడ్డి, వేల్పుల నాగరాజు, జంగ మహేందర్‌యాదవ్, తిరుపతి, దేవి లావణ్య పాల్గొన్నారు.


