అర్జీలు స్వీకరించిన సీపీ | - | Sakshi
Sakshi News home page

అర్జీలు స్వీకరించిన సీపీ

Sep 8 2026 12:47 AM | Updated on Sep 8 2026 12:47 AM

గోదావరిఖని: రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతీ ఫి ర్యాదుదారుతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను చట్టబద్ధంగా, పారదర్శకంగా, సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు పారదర్శకమైన పో లీసు సేవలు అందించడమే తమ లక్ష్యమని ఆ యన తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఆర్డీవో ఆఫీసులో ప్రజావాణికి స్పందన అంతంతే..

పెద్దపల్లిరూరల్‌: ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే సత్వరమే పరిష్కారం చూపాలనే ఆలోచనతో ఆర్డీవో, మండల పరిషత్‌ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ‘ప్రజావాణి’కి స్పందన అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. కిందిస్థాయి అధికారులకు ఇవ్వ డం కన్నా.. కలెక్టర్‌ ఇతర జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళితే సమస్యకుఫలితం ఉంటుందన్న ఆశ ఉండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కాగా, సోమవారం నిర్వహించిన ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణిలో ఒక్కదరఖాస్తు రాగా.. ఆర్డీవో ఆఫీసుకు రెండు వినతులు వచ్చినట్టు అధికారులు తెలిపారు.

లోకోపైలెట్లకు పురస్కారాలు

రామగుండం: విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన స్థానిక లోకో పైలెట్లకు సికింద్రాబాద్‌ డివిజనల్‌ కార్యాలయంలో సోమ వారం సేఫ్టీ పురస్కారాలు అందజేశారు. త్రై మాసిక భద్రతా విభాగం విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన లోకోపైలెట్లు సీహెచ్‌ రవి, అజయ్‌కుమార్‌, కౌశల్‌ ప్రజాపతి పురస్కారాలతోపాటు ప్రశంసాపత్రాలను స్వీకరించారు. వారికి సహ ఉద్యోగులు, మిత్రులు తదితరులు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

ఆర్చరీ పోటీలకు ఎంపిక

పెద్దపల్లి/ఎలిగేడు: సంగారెడ్డి జిల్లా కొల్లూరు లో ఇటీవల నిర్వహించిన జూనియర్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్‌–2026 పోటీల్లో సుల్తానాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థి టి.యశ్వంత్‌ ఎంపికయ్యాడు. అక్టోబర్‌ 23 నుంచి 26 వరకు రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగే జూనియర్‌ నేషనల్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ తరఫున యశ్వంత్‌ ప్రాతినిధ్యం వహించనున్నట్లు స్పోర్ట్స్‌ ఇన్‌చార్జి సునీల్‌ తెలిపారు. యశ్వంత్‌ను ప్రిన్సిపాల్‌ మాధవీలత అభినందించారు.

సమస్యలు పరిష్కరించాలి

కోల్‌సిటీ: ప్రభుత్వ ఉద్యోగులకు రెండోవేతన సవరణ సంఘం(పీఆర్‌సీ)ను అమలు చేయా లని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే మంజూరు చేయాలని ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ మూర్తి డిమాండ్‌ చేశారు. సోమవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి(జీజీహెచ్‌)లో నిర్వహించిన యూనియన్‌ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. 317 జీవోతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు తక్షణమే న్యాయం చేయాలని కోరారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పిట్టల స్వాతి మాట్లాడుతూ నర్సింగ్‌ సిబ్బందికి ప్రత్యేక డైరెక్టరేట్‌ ఏర్పాటు చేయాలన్నారు.

పురస్కారాలు అందుకుంటున్న లోకోపైలెట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement