పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: కమాన్ వద్ద రాజీవ్ రహదారిపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో చేశారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ఆరంభంలోనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు నానాహంగామా సృష్టించి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వాఖ్యలు చేశారని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బూతగడ్డ సంపత్, మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, పీఏసీఎస్ చైర్మన్ ముత్యాల నరేశ్ తప్పుపట్టారు. ఎమ్మెల్సీ మధును సభనుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, నాయకులు ముస్కాన్‌నాజ్ నయ్యర్, మంథని నర్సింగ్, జగదీశ్, సరస్వతి, శ్రీకాంత్, ఫణీంద్ర, పూదరి మహేందర్, సర్పంచులు సంపత్‌రావు ఆరె సంతోష్, కల్వల తిరుపతి, శ్రీనివాస్ పాల్గొన్నారు. సుల్తానాబాద్‌లోనూ నిరసన తెలిపారు.


