రాజీవ్ రహదారిపై ప్రమాదాల నివారణకు అధికారులు, రహదారి నిర్వహణ సంస్థ, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా స్థల పరిశీలన చేసి సేఫ్టీ ఆడిట్ చేయాలి. అవసరమైనచోట సర్వీస్ రోడ్డు ఏర్పాటు, యూటర్న్‌ల పునర్వ్యవస్థీకరణ, సరైన సైన్‌బోర్డులు, లైటింగ్, రోడ్డు మార్కింగ్, వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలి. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ప్రమాదాలకు కారణమవుతున్న లోపాలను ముందుగానే గుర్తించి సరిదిద్దితే ప్రాణ నష్టాన్ని నివారించే అవకాశం ఉంటుంది.
– గీట్ల లక్ష్మారెడ్డి, సీపీఎం నాయకుడు


