ఓదెల: ఓదెల మల్లికార్జునస్వామికి భక్తులు ఆదివారం కోడెమొక్కులు చెల్లించారు. ఉమ్మడి క రీంనగర్‌జిల్లాతోపాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
నేడు మంత్రి శ్రీధర్‌బాబు రాక
మంథని/కమాన్‌పూర్: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సోమవారం మంథని, కమాన్‌పూర్ మండలాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వ పా ఠశాలల విద్యార్థులకు ఉదయం టిఫిన్ అందించడం కోసం హరే రామ హారే కృష్ణ ట్రస్ట్ గంగాపురిలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్, గంగాపురి వద్ద రూ.2.55కోట్లతో నిర్మించిన 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంత్రి ప్రారంభించనున్నారు. అలాగే కమాన్‌పూర్ మండలంలో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్తాపన చేయనున్నారు.
దరఖాస్తులు ఆహ్వానం
పెద్దపల్లిరూరల్: ప్రభుత్వం చేయూత పథకం ద్వారా అర్హులైనవారిని ఎంపిక చేసేందుకు దర ఖాస్తులను స్వీకరిస్తోందని, ఆసక్తిగలవారు ఈ నెల 25వరకు దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ కోరారు. దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 31వ తేదీ వరకు గడువు ఉ న్నా.. సాంకేతిక సమస్యలు తలెత్తితే ఇబ్బందులవుతాయన్నారు. శనివారం వరకు 644 దర ఖాస్తులను ఆన్‌లైన్ చేసినట్టు వివరించారు.
పింఛన్ మంజూరుకు కఠిన నిర్ణయాలు
పెద్దపల్లి: ప్రభుత్వం చేయూత పథకం ద్వారా కొత్తగా పింఛన్లు మంజూరు చేసేందుకు కఠిన నిబంధనలు విధించింది. ఈ మేరకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరుపుతుంది. ఆ తర్వాతే లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. ఇప్పటికే జిల్లాలో పింఛన్ మంజూరు కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.
పుట్టినరోజు మంచి నిర్ణయం
జ్యోతినగర్: పుట్టినరోజు వేడుకలను వ్యక్తిగత సంబరాలకే పరిమితం చేయకుండా.. సమాజానికి ఉపయోగపడే మంచి నిర్ణయం తీసుకున్నారు మాజీ కార్పొరేటర్, సామాజిక సేవకుడు, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి అధ్యక్షుడు కోదాటి ప్రవీణ్. ఎన్టీపీసీ జ్యోతినగర్‌లోని సాయి సేవా సమితిలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రవీ ణ్ తన అవయవదాన అంగీకార పత్రాన్ని సదాశయ ఫౌండేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు లగిశెట్టి చంద్రమౌళికి అందజేశారు. ఆయనను పలువురు అభి నందించారు. కార్యక్రమంలో గోదావరిఖని స్ఫూర్తి లయన్స్ క్లబ్ కోశాధికారి రెడ్డి రవీందర్‌రెడ్డి, ప్రతినిధులు మహేందర్‌రెడ్డి, చింతల సతీశ్, ధరణి పోశం, బుర్ర దేవేందర్, అనిల్‌రావు, దుర్గాప్రసాద్, సదాశ య ఫౌండేషన్ ప్రతినిధులు లక్ష్మీనారాయణ, బోళ్ల చంద్రశేఖర్, రఘురాం తదితరులు పాల్గొన్నారు.
సింగపూర్ పర్యటనకు హెచ్‌ఎం
ధర్మారం: రచ్చపల్లి ప్రభు త్వ ప్రాథమిక పాఠశాల ప్ర ధానోపాద్యాయుడు సముద్రాల వంశీమోహానాచార్యు లు సింగపూర్ పర్యటనకు ఎంపికయ్యారు. ప్రభుత్వం రూపొందించిన ఫ్లోర్ విజిట్ తొలివిడతలో ఆ యనను ఎంపిక చేసినట్లు విద్యాశాఖ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 29 మంది ఉపాధ్యాయులను సింగపూర్ పర్యటను ఎంపిక చేయగా ఇందులో వంశీమోహనాచా ర్యులకూ చోటుదక్కింది.
వినూత్న కార్యక్రమాలతో గుర్తింపు
హెచ్‌ఎం వంశీమోహనాచార్యులు అనేక వినూ త్న విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందారు. ప్రైవేటు పాఠశాల ల విద్యార్థులు సర్కారు బడుల విద్యార్థులతో పోటీ పరీక్షల్లో పాల్గొని తమ పిల్లలకంటే ఎక్కువగా ప్రతిభ కనబర్చితే రూ.500 నజరానా ఇస్తానని చాలెంజ్ చేసి సఫలీకృతులయ్యారు. ఇలా విద్యార్థులను ఆకర్షించి అడ్మిషన్లు పెంచారు. కిడ్డీ బ్యాంకు, గణిత అష్టావధానం, తెలుగు భాషా దినోత్సవంలాంటి అనేక కార్య క్రమాలు నిర్వహించారు. సెప్టెంబర్ 12 నుంచి 19 వరకు సింగపూర్‌లో జరిగే పర్యటనలో దేశంలో విద్యా విధానాలు, బోధనా పద్ధతు లపై అధ్యయనం చేసి తిరిగి వచ్చి ఇక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తారు.


