తెరిపినివ్వని వర్షం | - | Sakshi
Sakshi News home page

తెరిపినివ్వని వర్షం

Jul 31 2026 1:51 AM | Updated on Jul 31 2026 1:51 AM

జిల్లాలో జలకళ సంతరించుకుంటున్న చెరువులు వ్యవసాయ పనుల్లో రైతులు బిజీబిజీ వాగులు పొంగి పలు చోట్ల రాకపోకలకు అంతరాయం తొందరవద్దు.. ప్రత్యామ్నాయమే మేలంటున్న అధికారులు

సాక్షి,పెద్దపల్లి: రెండు రోజులుగా కురుస్తున్న భారీ నుంచి మోస్తరు వర్షాలు జిల్లాలో రైతుల్లో కొత్త ఆశలు చిగురింపజేశాయి. చెరువులు జలకళ సంతరించుకోగా, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరినాట్లతో రైతులు పొలాల్లో బిజీగా మారినప్పటికీ, అల్ప పీడన ప్రభావంతో కురుస్తున్న ఈ వర్షాలను నమ్ముకుని వరి సాగుకు తొందరపడ్డొద్దని వ్యవసాయశాఖ అధికారలు హెచ్చరిస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలలని సూచిస్తున్నారు. తెరి పివ్వకుండా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో లోలెవల్‌ బ్రిడ్జిలు నీటమునగగా, రాకపోకలకు అంతరాయం కలిగింది. ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు గురువారం జిల్లా కలెక్టర్‌, ఇతర ఉన్నాతాధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు అప్రమత్తం చేశారు.

81.7మి.మీ వర్షపాతం

జిల్లాలో సగటున 81.7మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రామగుండంలో 103.4మి.మీ, మంఽథనిలో 101.4మి,మీ, శ్రీరాంపూర్‌లో 101.5 మి.మీ వర్షపాతం నమోదైంది. జూలపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్‌ల మండలాల్లో ఇప్పటికీ వర్షపాతం లోటు కొనసాగుతోంది.

చెరువులకు జలకళ

ఇటీవల వరకు వర్షాభావంతో చెరువులు, కుంటలు బోసిపోతూ కనిపించాయి. వరినార్లు ముదిరి అన్నదాతకు ఈసీజన్‌ కష్టాలు తెచ్చిపెడుతున్న క్రమంలో వరణుడు కరుణించాడు. దీంతో జిల్లావ్యాప్తంగా 1,027 చెరువులుండగా, వాటిలో రెండురోజులుగా కురుస్తున్నా వర్షాలతో 186 చెరువులు మత్తడి దూకుతున్నాయి. అలాగే 75శాతం పైగా 273 చెరువులు నిండాయి. 50 శాతంకు పైగా 212 చెరువులు, 25శాతంకి పైగా 140 చెరువులు నిండాయి. మరోవారం రోజులు ఇలానే వానాలు పడితే చెరువులు పూర్తి స్థాయిలో నిండుతాయని, సాగుకు ఢోకా ఉండదని రైతన్నలు అశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఎల్లంపల్లికి భారీ వరద ప్రవాహం

ఎగువ ప్రాంతాల్లో రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎల్లంపల్లికి వరద ప్రవాహం పెరుగుతోంది. కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ఈ ఏడాదిలోనే అత్యధికంగా 2.75లక్షల క్యూసెక్కుల వరదనీరు ఎల్లంపల్లికి చేరింది. సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ప్రస్తుతం పూర్తిస్థాయి నిల్వ ఉంది. భారీగా వచ్చిచేరుతున్న వరద ప్రవాహంతో గేట్లు ఎత్తి, నీటిని దిగువకు వదుతులున్నారు. నది పరివాహక ప్రాంతలో చేపలు పట్టేవారుగాని, పశువుల, గొర్రె కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గాలేవని, తొందరపడి వరిసాగు చేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని సూచిస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలే సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు.

నిలిచిన రాకపోకలు

ధర్మారం: ధర్మారం మండలం రామయ్యపల్లి–రచ్చపల్లి గ్రామాల మధ్య లోలెవల్‌ బ్రిడ్జిపై వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జిపై నుంచి ఎవరూ వెళ్లకుండా ట్రాక్టర్‌ను అడ్డుగా పెట్టారు. దీంతో దూర ప్రాంతాల వారకు ఇతర మార్గాల ద్వారా వెళ్తున్నారు.

నేలకూలిన భారీ వృక్షం

యైటింక్లయిన్‌కాలనీ: సింగరేణి ఆర్జీ–2ఏరియా యైటింక్లయిన్‌కాలనీ టీ2–397 క్వార్టర్స్‌ ఏరియాలో భారీ వృక్షం నేల కూలి విద్యుత్‌ తీగలపై పడింది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో సింగరేణి అధి కారులు చెట్టును తొలగించి విద్యుత్‌ను పునరుద్ధరించారు. భారీ వృక్షాలను సింగరేణి యజమాన్యం తొ లగించాలని కార్మిక కుటుంబాలు విజ్ఞప్తి చేశాయి.

నీటమునిగిన పంటపొలాలు

పాలకుర్తి: కొత్తపల్లి, ఈసాలతక్కళ్లపల్లి, పాలకుర్తి, జయ్యారం గ్రామాల చెరువులు వరదనీటితో నిండిపోయి జలకళ సంతరించుకున్నాయి. పత్తి, వరిపంటలు పూర్తిగా నీటితో మునిగిపోయాయి. రహదారుల వెంబడి వరదనీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement