కాల్వశ్రీరాంపూర్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి జాఫర్‌ఖాన్‌పేట గ్రామాల మధ్య పాండవ లొంక జలపాతం కనువిందు చేస్తోంది. ప్రమాదాలకు తావు ఉండొద్దని పోలీసులు, రెవెన్యూ అధికారులు జలపాతం వద్దకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.
కొనసాగుతున్న ఎత్తిపోతలు
ధర్మారం: ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో మేడారంలోని నంది పం్‌ప్‌హౌస్ నుంచి ఐదు మోటార్ల ద్వారా నీటిని మేడారం రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నారు. ఒక్కో మోటార్ ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున 15,750 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. అదే పరిమాణంలో మేడారం రిజర్వాయర్ నుంచి రెండు నీటి సొరంగాల ద్వారా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయిత్రీ పంప్‌హౌస్‌కు తరలిస్తున్నట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.
గోదావరినదిలో పెరుగుతున్న వరద ఉధృతి
గోదావరిఖని: గోదావరినదిలో వరద ఉధృతి పెరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. గోదావరిఖని ఏసీపీ మడత రమేశ్, సీఐ ఇంద్రసేనారెడ్డి సమ్మక్క సారలమ్మ గద్దెల సమీపంలోని గోదావరినది పుష్కరఘాట్ వద్దకు వెళ్లి పరిస్థితి సమీక్షించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని కిందకు వదులుతున్న నేపథ్యంలో నది తీరం వెంట ఎవరూ ఉండవద్దని, చేపలు పట్టేవారు గోదావరినదిలోకి వెళ్లవద్దని హెచ్చరికలు చేశారు. ఈప్రాంతంలో ప్రత్యేక పికెటింగ్ ఏర్పాటు చేశారు.
ఘనంగా తీజ్ ఉత్సవాలు
పాలకుర్తి: పాలకుర్తి మండం బామ్లానాయక్‌తండా, రాజీవ్‌తండా గ్రామాల్లో గురువారం గిరిజనుల పండుగ తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ మహరాజ్, జగదాంబ అమ్మవారికి పూజలు చేసి ప్రత్యేక బుట్టల్లో పెంచిన గోధుమనారును నెత్తిన పెట్టుకొని డప్పుచప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ చెరువులో నిమజ్జనం చేశారు. పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బసంత్‌నగర్ ఎస్సై నూతి శ్రీధర్, సర్పంచ్ అఖిల, రాజీవ్‌తండా నాయకులు ఇస్లావత్ సమ్మయ్య, అంజినాయక్, శంకర్‌నాయక్, పూల్‌చంద్, సారయ్య, తిరుపతి, నగేశ్, జగన్ తదితరులు పాల్గొన్నారు.
భూపతిపూర్‌లో ‘సర్’ వందశాతం పూర్తి
సుల్తానాబాద్‌రూరల్: సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ సర్ ప్రక్రియ వంద శాతం పూర్తి అయినట్లు సర్పంచ్ పోచంపల్లి చిన్నయ్య తెలి పారు. గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం బీఎల్‌వో సరో జన, జీపీవో సృజనను సన్మానించారు. సర్ ప్రక్రియకు సహకరించిన గ్రామస్తులకు అభినందనలు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి ఆసియాబేగం, పాలకవర్గసభ్యులు పాల్గొన్నారు.


