పెద్దపల్లి: జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)పర్సన్ ఇన్‌చార్జి నియామక ప్రక్రియ తుది దశకు చేరింది. మొదటి విడతలో 7 సొసైటీలకు పర్సన్ ఇన్‌చార్జీల పేర్లతో కూడిన ఫైల్ ముఖ్యమంత్రి వద్దకు చేరినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరో 2 రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొ దటి విడతలో పర్సన్ ఇన్‌చార్జీలుగా గర్రెపల్లి పీఏసీ ఎస్‌కు కల్లెపల్లి జానీ, చిన్నకల్వల విండోకు మురళీధర్‌రావు, కనుకుల ీపీఏసీఎస్‌కు చిలుక సతీశ్, సుద్దాలకుీ భాస్కర్‌రెడ్డి, ఎలిగేడు విండోకు సామ రాజేశ్వర్‌రెడ్డి, జూలపల్లిీ పీఏసీఎస్‌కు జలపతిరెడ్డి, పెద్దపల్లి్‌ీ పపీఏసీఎస్‌కు నరేశ్ ముదిరాజ్ పేర్లకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
పెద్దపల్లి నియోజకవర్గంలోనే
అధిక పీఏసీఎస్‌లు
జిల్లాలోనే అత్యధికంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నాయి. మొత్తం 13 పీఏసీఎస్‌లు ఉండగా, తొలి విడతలో 7 సొసైటీలకు చైర్మన్ల నియామకానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. మిగిలిన 6 సొసైటీల విషయంలో స్థానిక నాయకుల మధ్య సమన్వయం, రాజకీయ సమీకరణాలపై చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. వాటికి సంబంధించిన నిర్ణయం రెండో విడతలో తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, పర్సన్ ఇన్‌చార్జి పదవుల కోసం ఆశావహులు పెద్ద సంఖ్యలో ప్రయత్నాలు చేసినా, పార్టీకి విధేయులుగా పనిచేసిన వారికే తొలి విడతలో ప్రాధాన్యం దక్కిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాత మిగిలిన సొసైటీల నియామకాలపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
పాత కమిటీలకు అవకాశం దక్కేనా?
గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన పాలకవర్గ సభ్యులకు పర్సన్ ఇన్‌చార్జిగా అవకాశం దక్కేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాలకవర్గాల నియామకం పూర్తి చేసి జీవో తెచ్చేందుకే హైదరాబాద్‌లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యేల సిఫారసు మేరకే సొసైటీ ఇన్‌చార్జితో పాటు 12 మంది సభ్యులను డైరెక్టర్లుగా గతంలో ఉన్న రిజర్వేషన్ ఆధారంగా నియామకం చేయనున్నారు.
పదవీకాలం ఆరునెలలే
సింగిల్‌విండో పర్సన్ ఇన్‌చార్జీల పదవీకాలం 6 నెలలే ఉండే అవకాశాలు ఉన్నాయి. నామినేటెడ్ పోస్టులు కావడంతో ఆరునెలలకు నియామకం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తే మాత్రం పదవీకాలం ఐదేళ్లు ఉండే అవకాశం ఉంది. గతేడాదే పీఎసీఎస్ పాలకవర్గాల గడువు ముగిసింది. మధ్యలో కొన్నాళ్లు ఆయా పాలకవర్గాల గడువును పొడిగిస్తూ వచ్చింది. గత డిసెంబర్‌లో పాలకవర్గాల గడువు పొడగించకుండా ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. దీంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈనేపథ్యంలో కోర్టు ప్రత్యేక అధికారుల నియామకాన్ని రద్దు చేసింది. పాత పాలకవర్గాలు కొనసాగించకుండా ఎన్నికల నిర్వహించే వరకు పర్సన్ ఇన్‌చార్జి, కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపడుతాయి.
పెండింగ్‌లో ఉన్న పీఏసీఎస్‌లు
పెద్దపల్లి నియోజకవర్గంలో మొత్తం 13 సొసైటీలు ఉండగా సుల్తానాబాద్, ధూళికట్ట, పోత్కపల్లి, కూనారం, అప్పన్నపేట్, కాల్వశ్రీరాంపూర్ సొసైటీలకు సయోధ్య కుదరక పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని సొసైటీల్లో ఎన్నికలకు ముందు గత ప్రభుత్వంలో పని చేసినవారు కాంగ్రెస్‌లో చేరడంతో వారికి అవకాశం ఇవ్వాలని అంశంపై ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో 6 సొసైటీలను పెండింగ్‌లో ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది.


