గోదావరిఖని(రామగుండం): పదోన్నతితో పాటు బాధ్యత కూడా పెరుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్‌కిషోర్‌ఝా అన్నారు. ఏఎస్సైలుగా విధులు నిర్వహిస్తూ ఎస్సైగా పదోన్నతి పొందిన ఎ.సత్తయ్య, పి.వెంకన్నగౌడ్, ఎంఏ హబీబ్‌కు గురువారం పదోన్నతి చిహ్నాలను అలంకరించి అభినందించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం పనిచేసే పోలీసుశాఖలో పదోన్నతి పొందిన ప్రతి పోలీసు అధికారి బాధ్యతతో వ్యవహరించాలన్నారు. అప్పగించిన విధులను సమర్థవంతంగా, నిజాయితీతో, నిబద్ధతతో నిర్వహించాలన్నారు. పదోన్నతి పొందడం ప్రతి ఉద్యోగికి గర్వకారణమని, అయితే దానితో పాటు బాధ్యత కూడా అలాగే ఉండాలన్నారు.
అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
జ్యోతినగర్(రామగుండం): అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. గురువారం రామగుండం కార్పొరేషన్ 2,3వ డివిజన్లు మల్కాపూర్, న్యూపోరట్‌పల్లి ప్రాంతాల్లో కార్పొరేటర్లు వెంగల బాపు, వడ్లూరి రవితో కలిసి పర్యటించారు. అమృత్ జలాశయాల పునరుజ్జీవన పథకంలో భాగంగా మల్కాపూర్ చెరువులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. వర్షాకాలం దృష్ట్యా యంత్రాలు, పని వాళ్ళను ఎక్కువ సంఖ్యలో వినియోగించి త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. టీపీఎస్ నవీన్, ఏఈ తేజస్విని, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం ఏఈ మౌనిక, మనోజ్, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు కృపాకర్‌రావు పాల్గొన్నారు.
రాజకీయ జోక్యంతో సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం
రామగిరి(మంథని): సింగరేణిలో మీతిమీరిన రాజకీయ జోక్యంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మందా నరసింహారావు అన్నారు. గురువారం ఆర్జీ–3 ఏరియా ఓసీపీ–2లో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.54 వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు విఫలం అయ్యాయన్నారు. 2020 తర్వాత అండర్ర్‌గౌండ్ నుంచి సర్పేస్‌కి వచ్చి బేసిక్‌లు నష్టపోయిన జనరల్ అసిస్టెంట్ల తరఫున న్యాయ పోరాటానికి సీఐటీయూ సిద్ధంగా ఉందన్నారు. బ్రాంచ్ సెక్రటరీ డి.కొమురయ్య, నాయకులు ఎద్దు కుమార్, రమణారెడ్డి, అసరి మహేశ్, వేణుగోపాల్, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


