కాళేశ్వరం పంపులు ప్రారంభించి చెరువులు నింపాలి | - | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం పంపులు ప్రారంభించి చెరువులు నింపాలి

Jul 17 2026 7:09 AM | Updated on Jul 17 2026 7:09 AM

పెద్దపల్లి: ఉత్తర తెలంగాణలో సాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చుతోందని, ఎండిపోయిన చెరువులను నింపేందుకు ప్రభుత్వం తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంపులను ప్రారంభించాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి చిరుమల్ల రాకేశ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. గురువారం పెద్దపల్లిలో మాట్లాడారు. పెద్దపల్లి ప్రాంతంలో ఎల్లమ్మ చెరువు సహా అనేక చెరువులు పూర్తిగా ఎండిపోవడంతో రైతులు నాట్లు వేయలేక అల్లాడుతున్నారనిపేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారం కంటే బీఆర్‌ఎస్‌ నాయకులను విమర్శించడానికే ప్రాధాన్యత ఇస్తోందని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రెస్‌మీట్లతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతు విషయంలో కేటీఆర్‌, హరీశ్‌రావు చేసిన సవాల్‌ను ప్రభుత్వం స్వీకరించాలని, అవసరమైతే నిర్వహణ బాధ్యతలను తమకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ విమర్శలు మానుకొని, క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్‌, మోబిన్‌, పడాల సతీశ్‌గౌడ్‌, స్వామి, మేకల కుమార్‌యాదవ్‌, కర్రె దేవేందర్‌రెడ్డి, పోసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఉప్పు శివకుమార్‌, బోయిని మనోజ్‌, కంచి నాగరాజ్‌, కిరణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement