గ్రామ శివారులో సర్వేనంబర్ 82లో నాలుగున్నర ఎకరాల భూమికి పట్టా ఉన్నా.. అందులో ఎకరం తక్కువగా ఉంది. పదేళ్లుగా సర్వే చేయించేందుకు చలాను కట్టి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న. అధికారులు హద్దులు నిర్ణయించడం లేదు. ప్రస్తుతం చేపట్టిన భూ రీ సర్వేతోనైనా సమస్యకు పరిష్కారం చూపాలి. – కామ శంకర్, సబ్బితం
మిషన్ పనిచేయడం లేదట
నాకు ఉన్న మూడు ఎకరాల భూమిని మా అమ్మ పేరిట చేయించేందుకు 10 రోజుల నుంచి తిరుగుతున్న. రిజిస్ట్రేషన్ చేపిద్దామంటే మిషన్ పనిచేయడం లేదని చెబుతున్నారు. ఏం చేయాలో తెలియక పడిగాపులు కాస్తున్నాం.
– దుర్గం శ్రీనివాస్, రైతు, గుంపుల


