జైబోలో హనుమాన్‌కీ..
పెద్దపల్లిరూరల్: ‘జై శ్రీరాం.. జైబోలో హనుమాన్‌కీ..’ నినాదాలతో జిల్లా కేంద్రం మార్మోగింది. పట్టణమంతా కాషాయమయమైంది. పట్టణంలోని అయ్యప్ప ఆలయం వద్ద మంగళవారం విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో వీరహనుమాన్ విజయయాత్ర ప్రారంభించారు. పురవీధుల గుండా యాత్ర కొనసాగింది. మినీట్యాంక్‌బండ్ వరకు కొనసాగిన యాత్రలో వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ నాయకులు, కార్యకర్తలతోపాటు బీజేపీ, బీజేవైఎం తదితర అనుబంధ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కమల్ కిశోర్ శారడ, డీఆర్‌యూసీసీ సభ్యుడు ఎన్‌డీ తివారీ, బీకే జాకోటియా, జంగ చక్రధర్‌రెడ్డి, సతీశ్, భారీసంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.


