మంథనిలో కాంగ్రెస్‌ ఒంటరి పోరాటం | Sakshi
Sakshi News home page

మంథనిలో కాంగ్రెస్‌ ఒంటరి పోరాటం

Published Mon, Nov 20 2023 11:42 PM

- - Sakshi

సాక్షి, పెద్దపల్లి: మంథని అసెంబ్లీకి ప్రధాన పార్టీల తరపున నలుగురు అభ్యర్థులు పోటీపడుతున్నా.. ప్రధానంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ నెలకొంది. పోలింగ్‌ గడువు సమీపిస్తున్న వేళ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్సీ కవిత సభల సక్సెస్‌తో గులాబీ శ్రేణుల్లో ఉత్సహం నెలకొంది. పల్లె, ప ట్టణాల్లో బీఆర్‌ఎస్‌ ప్రచారం హోరెత్తిస్తుండటంతో కారు పార్టీలో జోష్‌ కనిపిస్తోంది.

కాంగ్రెస్‌ తరఫున రాహుల్‌గాంధీ పర్యటనతో హస్తం పార్టీలో జోష్‌ నె లకొన్నా.. ఆ తర్వాత మరే ఇతర అగ్రనేతలు ప్రచా రానికి రాకపోవడం, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఒంట రిగా ప్రచారం చేస్తుండడంతో వెనకబడినట్లు కనిపిస్తోంది. రాహుల్‌ పర్యటనతో కాంగ్రెస్‌లో ఊపు వ చ్చినా, ఆ సభ తర్వాత కేసీఆర్‌, కవిత సభలు నిర్వహించి సక్సెస్‌ చేయడంతోపాటు, కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, కాంగ్రెస్‌ హయాంలో జరగని అభివృద్ధిని తొమ్మిదేళ్లలోనే చేశామంటూ చేసిన వి మర్శలకు సరైన కౌంటర్‌ కాంగ్రెస్‌ నుంచి లేకపోవడంతో సొంత క్యాడర్‌లో ఆయోమయం నెలకొంది.

బలపడుతున్న బహుజనవాదం
మంథనిలో ఇటీవల పర్యటించిన సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. బీసీ బిడ్డను గెలిపించుకోవాలని, పుట్ట మధు గెలుపు కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, ఉద్యోగులు, యువకులు కలిసి పనిచేయాలని అభ్యర్థించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుట్ట మధు సైతం బహుజన వాదంతో బీసీ బిడ్డను గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తుండగా, సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలతో బీసీ వాదానికి బలాన్ని ఇచ్చినట్లయింది. పుట్ట మధును గెలిపిస్తే రూ.1,000కోట్లతో అభివృద్ధి చేస్తానని ప్రకటించటం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఎమ్మెల్సీ కవిత పర్యటన సందర్భంగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్‌బాబు హయాంలో చేసిన అభివృద్ధి, ఒకసారి ఎమ్మెల్యేగా, జెడ్పీ చైర్మన్‌గా పుట్ట మధు చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.

సింగరేణిని అప్పులపాలు చేసి, 49శాతం వాటాను కేంద్రానికి కట్టబెట్టింది కాంగ్రెస్‌ పార్టీయేనని విమర్శలు గుప్పించారు. కొన్నిరోజులుగా బీఆర్‌ఎస్‌ విమర్శలకు కాంగ్రెస్‌ నుంచి ధీటైన స్పందన కరువైందని ఆ పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకేకుటుంబానికి ఏడుసార్లు అవకాశం కల్పించిన మంథనిలో ఆశించినమేర అభివృద్ధి సాధించలేదనే విమర్శలు వినిపిస్తున్న వేళ.. నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటారో, మరోసారి శ్రీధర్‌బాబుకు అవకాశం కల్పిస్తారో డిసెంబర్‌ 3న తేలనుంది.

Advertisement
Advertisement