కోట్లు వెచ్చించినా కదిలేదేలే
రూ.45లక్షల హుక్ హోల్డర్
దీని పేరు హుక్ హోల్డర్. ఖరీదు రూ.45లక్షలు. ఐదేళ్ల క్రితం చెత్త నిర్వహణ కోసం బల్దియా అధికా రులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం గౌతమినగర్‌లోని డీఆర్‌సీసీ సెంటర్‌లో ఎండకు ఎండుతూ, వానకు తడస్తూ నిరుపయోగంగా పడేసి ఉంది. ఈ వాహనం చాలా వరకు తుప్పుపడుతోంది. సుమారు 50 ఆటో ట్రాలీల చెత్తనంతా ఒక కంపాక్టర్‌లో వేయాల్సి ఉంటుంది. ఇలా కంపాక్టర్ పూర్తిగా నిండాక, ఆ దానిని హుక్ హోల్డర్ వాహనంపై ఎక్కించుకొని డంపింగ్ యార్డుకు తరలించడానికి ఈ వాహనాన్ని కొనుగోలు చేశారు. కానీ, ఒక్క రోజు కూడా ఈ వాహనాన్ని ఉపయోగించిన దాఖలాల్లేవ్.
నిరుపయోగంగా స్వీపింగ్ మిషన్
దీని పేరు స్వీపింగ్ మిషన్. ఖరీదు రూ.65 లక్షలు. రోడ్లను కార్మికులకంటే వేగంగా శుభ్రం చేస్తుందనే ఉద్దేశంతో ఐదేళ్ల క్రితం కొనుగోలు చేశారు. ఉపయోగం కంటే దీనికి రిపేర్లే ఎక్కువ. తరుచూ మరమ్మతు సమస్యలే. మరమ్మతు ఖర్చులను వెచ్చించలేక స్వీపింగ్ మిషన్‌ను మూలన పడేశారు.
కోట్లు వెచ్చించినా కదిలేదేలే


