అనుమతి లేని డ్రోన్లు, డీజే సౌండ్స్‌పై చర్యలు | - | Sakshi
Sakshi News home page

అనుమతి లేని డ్రోన్లు, డీజే సౌండ్స్‌పై చర్యలు

Mar 2 2026 7:38 AM | Updated on Mar 2 2026 7:38 AM

అనుమత

అనుమతి లేని డ్రోన్లు, డీజే సౌండ్స్‌పై చర్యలు

● ఎమ్మెల్యే విజయరమణారావు

గోదావరిఖని(రామగుండం): అనుమతిలేని డ్రోన్లు, డీజే సౌండ్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా ఆదివారం ప్రకటనలో హెచ్చరించారు. సాధారణ పౌరులు, మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆదేశాలు జారీ చేశామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలు వచ్చేనెల 1వరకు అమలులో ఉంటాయన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు, విద్యార్థుల చదువుకు భంగం కలగకుండా, శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు డీజే సౌండ్స్‌ వినియోగంపై నిషేధం విధించామన్నారు. కార్యక్రమాల నిర్వహణకు మైక్‌సెట్‌ అవసరమైతే సంబంధిత డివిజన్‌ ఏసీపీ అనుమతి తీసుకోవాలన్నారు. రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లలో సిటీ పోలీస్‌యాక్ట్‌ అమలులో ఉంటుందన్నారు. ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, కార్యక్రమాల నిర్వహణకు ముందుగా పోలీస్‌ అధికారుల అనుమతి తీసుకోవాలన్నారు. బంద్‌ల పేరిట సంస్థలు, కార్యాలయాలను బలవంతంగా మూసివేయించేందుకు ఒత్తిడి చేయడం, బెదిరింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మల్లన్న ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి

ఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షింగా ఉండాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. ఆదివారం స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని పట్నాలు, బోనం మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆలయ ఈవో సదయ్య, చైర్మన్‌ చీకట్ల మొండయ్య ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఓదెల మల్లన్న సన్నిధిలో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేలా అభివృద్ధి పనులు చేపడతామన్నారు. అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మూల ప్రేంసాగర్‌రెడ్డి, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

సేంద్రియ వ్యవసాయమే మేలు

పెద్దపల్లిరూరల్‌: తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే సేంద్రియ సాగు విధానాన్ని పాటించాలని శ్రీవెంకటేశ్వర సొసైటీ, పవన్‌ ఆగ్రో ప్రాసెసింగ్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ డాక్టర్‌ శివాజీలాల్‌ డోలే అన్నారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లో ఆదివారం మాజీ సైనికోద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల విజయ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక రైతులు సేంద్రియ సాగుతో మంచి ఫలితాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సేంద్రియ సాగు విధానంపై అవగాహన కల్పించాలనే ఆలోచనతో మాజీ సైనికులు, రైతులను ఒకే వేదికపైకి తెచ్చి జై జవాన్‌..జై కిసాన్‌ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విజయ్‌కుమార్‌ తెలిపారు. జి ల్లాలోని రైతులంతా తమ సంస్థలో సభ్యత్వం పొందాలన్నారు. మాజీ సైనికులు మంథని ర మేశ్‌, సంతోష్‌కుమార్‌, సర్పంచ్‌లు ఆరె సంతోష్‌, మేకల రోజారాణి పాల్గొన్నారు.

అనుమతి లేని డ్రోన్లు,   డీజే సౌండ్స్‌పై చర్యలు1
1/2

అనుమతి లేని డ్రోన్లు, డీజే సౌండ్స్‌పై చర్యలు

అనుమతి లేని డ్రోన్లు,   డీజే సౌండ్స్‌పై చర్యలు2
2/2

అనుమతి లేని డ్రోన్లు, డీజే సౌండ్స్‌పై చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement