ఆనవాళ్లు లేని లిట్టర్‌పిక్కర్
దీన్ని లిట్టర్ పిక్కర్ అంటారు. ప్రత్యేక ట్రాలీలో యంత్రాన్ని అమర్చిన తర్వాత కంపెనీ బల్దియాకు పంపించింది. దీని ఖరీదు రూ.23.5 లక్షలు. రహదారులపైనున్న చెత్తను గొట్టం ద్వారా తీసుకొని, యంత్రంలోని ట్యాంకులో వేసుకుంటుంది. ట్యాంక్‌లో చెత్త నిండిన తర్వాత డంపింగ్ యార్డుకు తరలించాలి. కొత్తలో ఈ వాహనాన్ని ముచ్చటగా మూడురోజులు వినియోగించారు. ఐదేళ్లుగా దీన్ని ఉపయోగించకుండా మూలకుపడేశారు. ట్రాలీ వాహనం నుంచి యంత్రాన్ని తొలగించిన అధికారులు, ట్రాలీ వాహనాన్ని ఫాగింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. తొలగించిన లిట్టర్ పిక్కర్ యంత్రాన్ని శారదానగర్‌లోని వాటర్ ట్యాంక్ కింద ఆనవాళ్లేకుండా పడేశారు.


