సోలార్‌ పథకాన్ని వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సోలార్‌ పథకాన్ని వినియోగించుకోవాలి

Mar 2 2026 7:38 AM | Updated on Mar 2 2026 7:38 AM

సోలార్‌ పథకాన్ని వినియోగించుకోవాలి

సోలార్‌ పథకాన్ని వినియోగించుకోవాలి

● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

ధర్మారం(ధర్మపురి): వందశాతం సోలార్‌ వినియో గ గ్రామంగా మార్చడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు గ్రామస్తులు సహకరించాలని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ కోరా రు. ఆదివారం ధర్మారం మండలం నందిమేడారంలో సోలార్‌ వినియోగంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. మేడారం గ్రామాన్ని వందశాతం సోలార్‌ గ్రామంగా తీర్చిదిద్దుటకు ప్రభుత్వం రూ.51 కోట్లు వెచ్చించి పనులను యుద్ధప్రతిపాదికన మొదలు పెట్టి పూర్తిచేయుటకు కృషి చేస్తుందన్నారు. గ్రామంలో తొలివిడతలో 1,486 విద్యుత్‌ కనెక్షన్‌లకు రెండు కిలోవాట్స్‌ సోలార్‌ ప్యానల్‌ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రెండో విడతలో 628 వ్యవసాయ పంప్‌సెట్లకు సోలార్‌ ప్యానల్‌ ఏర్పాటు చేస్తామన్నారు.

ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోండి

ధర్మారం మండల కేంద్రంతో పాటు నర్సింగపూర్‌, ఖిలావనపర్తి గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ హయాంలో కబ్జాకు చేసిన అనర్హుల నుంచి భూములను స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులను మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ అదేశించారు. గత ప్రభుత్వంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పేదలకు పంపిణీ చేయాల్సిన ప్రభుత్వ భూములను కబ్జాచేసి వారి ఆధీనంలోకి తీసుకుని సాగుచేసుకుంటున్నారని ఆరోపించారు.

దళారుల ప్రమేయం లేకుండా బిల్లుల చెల్లింపు

దళారుల ప్రమేయం లేకుండా ఇందిరమ్మ లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాలోనే బిల్లులు జమ చేస్తున్నామని మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని గోపాల్‌రావుపేటలో తాండ్ర రజిత–గంగయ్య ఇందిరమ్మ పథకంలో నిర్మించుకున్న ఇంటిని ప్రారంభించారు. అనంతరం శ్రీలక్ష్మీవేంకటేశ్వరాలయం 20వ వార్షికోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి రూ.పది లక్షల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమాల్లో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ అరిగే లింగయ్య, సర్పంచు వీర్‌పాల్‌, నాయకులు చింతల ప్రదీప్‌రెడ్డి, యువజన కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు అసోద అజయ్‌, మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement