
మల్లేశ్వరి (ఫైల్)
కరీంనగర్‌క్రైం: పురుగులమందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందాడు. కరీంనగర్ వన్‌టౌన్ పోలీసుల వివరాల ప్ర కారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రాయపల్లికి చెందిన తుమ్మనపల్లి చందర్(50)కు అదే ప్రాంతానికి చెందిన రాధతో 30 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. నాలుగేళ్ల క్రి తం కుటుంబ కలహాలతో చందర్ కరీంనగర్‌లో ఉన్న తన బంధువు ఇంట్లో ఉండి ఒక ప్రవే ట్ ఆసుపత్రిలో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న చందర్ కుమారుడు వచ్చి అతడిని తన గ్రామానికి తీసుకెళ్లగా మల్లీ కరీంనగర్ వచ్చాడు. ఈక్రమంలో శనివారం చందర్ పురుగుల మందుతాగడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా చందర్ మృతిపై అనుమానం ఉందని మృతుడి భార్య రాధ ఆదివారం కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవికుమార్ తెలిపారు.
తెర్లుమద్దిలో..
ముస్తాబాద్(సిరిసిల్ల): అనారోగ్యం భరించలేక ఆత్మహత్యాయత్నానికి పా ల్పడ్డ ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ముస్తాబాద్ మండలం తెర్లుమద్దికి చెందిన ఎడ్ల రాజయ్య(47) ఈనెల 17న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ము స్తాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించా రు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. బోదా కాల వ్యాధితో బాధపడుతున్న రాజయ్య కొంతకాలంగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆ బాధ భరించలేక పురగుల మందు తాగాడు. కిరాణ దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న రాజయ్య మృతితో భార్య సరోజ, ఇద్దరు కూతుళ్ల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ముస్తాబాద్ ఎస్సై శేఖర్‌రెడ్డి తెలిపారు.
అడవి శ్రీరాంపూర్‌లో మహిళ..
ముత్తారం(మంథని): తమ పత్తి చేనుకు పురుగుల మందు స్ప్రే చేస్తుండగా అస్వస్థతకు గురైన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. పెద్దపల్లి జిల్లా ము త్తారం మండలం అడవిశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన బోగం మల్లేశ్వరి(38), తన భర్త శ్రీనివాస్ ఈనెల 16న పత్తి చేనుకు మందు పిచికారీ చేస్తున్న క్రమంలో అ స్వస్థతకు గురైంది. కరీంనగర్‌లోని ఆస్పత్రికి త రలించగా చికిత్సపొందుతూ మృతిచెందింది. మందు స్ప్రే చేసే సమయంలో మల్లేశ్వరి శ రీరంపై పడటం, వాసన తట్టుకోకపోవడం, ర క్షణ కవచాలు ధరించకపోవడంతోనే అస్వస్థత కు గురై చనిపోయిందని స్థానికులు తెలిపారు. మృతురాలికి కొడుకు, కూతురు ఉన్నారు.
గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారంలో విఫలం
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల): గల్ఫ్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ప్రవాసిమిత్ర లేబర్ యూనియన్ యూఏఈ దుబాయ్ అధ్యక్షుడు బత్తిని రాజాగౌడ్ అన్నారు. గల్ఫ్ కార్మికులకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేనందునే ప్రభుత్వాలు కార్మికుల సమస్యలపై దృష్టి సారించడంలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రవాసి భారతీయ బీమా యోజన పథకం సహజ మరణానికి కూడా వర్తింపజేయాలని కోరారు. గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల వార్షిక బడ్జెట్ కేటాయించి, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు గల్ఫ్‌లో ఎంతో మంది చనిపోయారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే గల్ఫ్ కార్మికుల కష్టాలు తీరుతాయనుకున్నామని కానీ ఎలాంటి మార్పులేదని వాపోయారు.