రోడ్డు ప్రమాదంలో.. యువకుడు.. తీవ్ర విషాదం! | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో.. యువకుడు.. తీవ్ర విషాదం!

Oct 17 2023 12:18 AM | Updated on Oct 17 2023 11:59 AM

- - Sakshi

రిత్విక్ రెడ్డి(ఫైల్)

సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌ శివారులో సోమవారం వేకువజామున గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో గుడిపాటి రిత్విక్‌రెడ్డి (26) దుర్మరణం పాలయ్యాడు. బసంత్‌నగర్‌ ఎస్సై వెంకటేశ్‌ కథనం ప్రకారం.. కాటారం మండలం దేవరాంపల్లికి చెందిన రిత్విక్‌రెడ్డి వ్యాపారం నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఆదివారం బైక్‌పై స్వగ్రామానికి వచ్చి తిరిగి సోమవారం వేకువజామున హైదరాబాద్‌కు పయనమయ్యాడు. రాఘవాపూర్‌ శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మరణించారు. మృతుడి తండ్రి గుడిపాటి సమ్మిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Follow the Sakshi TV channel on WhatsApp:

ఇవి చదవండి: ప్రేమించిన యువతి పెళ్లికి ఒప్పుకోలేదని.. యువకుడు..

Advertisement
 
Advertisement
Advertisement