● ఆర్జేడీ విజయ్‌భాస్కర్
గంట్యాడ: ఉపాధ్యాయులు అంకితభావంతో విధులు నిర్వహించాలని ఆర్జేడీ విజయ్‌భాస్కర్ అన్నారు. డీఈఓ మాణిక్యంనాయుడు, ఎంఈఓ సత్యనారాయణతో కలిసి మండలంలోని కొటారుబిల్లి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, గంట్యాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడుతూ.. విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా బోధన చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయరాలు ఝాన్సీ, కొటారుబిల్లి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ప్రధానోపాధ్యాయరాలు జ్యోతి పాల్గొన్నారు.


