ప్రజాస్వామ్యం అపహాస్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యం అపహాస్యం

Nov 2 2026 1:59 AM | Updated on Nov 2 2026 1:59 AM

ప్రజాస్వామ్యం అపహాస్యం

దాడులతో నెగ్గుకు వద్దామంటే ఎలా..?

అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో

ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా?

ఎన్నికల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన శాసనమండలి విపక్ష నేత

బొత్స సత్యనారాయణ

విజయనగరం రూరల్‌: ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది..? దాడులతో నెగ్గుకువద్దామన్న అధికార పార్టీ తీరుపై శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో భాగంగా సతీమణి బొత్స ఝాన్సీలక్ష్మితో కలిసి విజయనగరం జిల్లా కేంద్రంలోని ఎంఆర్‌ కాలేజీ పోలింగ్‌ కేంద్రంలో ఆదివారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయో అర్ధం కావడం లేదని, ప్రజాస్వామ్యబద్దంగా జరగడం లేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందని, ప్రజలు ప్రభుత్వంపై తిరగబడే రోజు వచ్చిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా అని ప్రశ్నించారు. ఎంతసేపు ప్రచార ఆర్భాటం తప్ప ప్రజా సంక్షేమం, అభివృద్ధి గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. విద్య ప్రాథమిక హక్కు అని, గత ప్రభుత్వం అనేక పాఠశాలలను నిర్మించిందని, అయితే ఎన్నికల సమయానికి కొన్ని అసంపూర్తి పనులు మిగిలిపోతే ఇప్పటికీ వాటిని పూర్తిచేయక విద్యార్థులకు విద్యను దూరం చేసిందన్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుకున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదన్నారు. ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకే ఓటు వేయాలని, ఈ ఎన్ని కల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు మేయర్‌, చైర్మన్‌ కార్పొరేటర్‌, కౌన్సిలర్లుగా విజయం సాధిస్తారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement