● ప్రాదేశికంలో వైఎస్సార్‌సీపీ ప్రచార హోరు | - | Sakshi
Sakshi News home page

● ప్రాదేశికంలో వైఎస్సార్‌సీపీ ప్రచార హోరు

Nov 2 2026 1:59 AM | Updated on Nov 2 2026 1:59 AM

● నీతి, నిజాయితీ గల నాయకులను ఎన్నుకోవాలి

ప్రాదేశిక పోరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కొమరాడ మండలంలోని నాగావళి నదికి ఆవల ఉన్న పాలెం, దళాయిపేట, కొట్టు, కొరిశీల, తులసివలస గ్రామాల్లో జెడ్పీటీసీ అభ్యర్థి కొండగొర్రి రామలక్ష్మి, ఎంపీటీసీ అభ్యర్థులు బి. తవుడమ్మ, పువ్వల పెద్దరాజు, సిరిపురం మంగమ్మ, పాలక నిరీషాలతో కలిసి వైఎస్సార్‌సీపీ మన్యం జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రజలు ఘన స్వాగతం పలికారు. – కొమరాడ

ప్రాదేశిక ఎన్నికల్లో ఓటు వేసే ముందు ప్రతీ ఓటరు ఆలోచించి నీతి, నిజాయితీ కలిగిన నాయకులను ఎన్నుకోవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పిలుపునిచ్చారు. ప్రాదేశిక ఎన్నికల పోరులో భాగంగా ఆమె వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల తరఫున శివ్వాం, గరుగుబిల్లి, బురదవెంకటాపురం, ఉల్లిభద్ర ప్రాదేశిక సెగ్మెంట్లలో ఆదివారం నిర్వహించిన ప్రచార సభల్లో పాల్గొన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో జగనన్న చేసిన మేలును ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. ప్రచారంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో జెడ్పీటీసీ అభ్యర్థి గుజ్జల నాగమణి, గరుగుబిల్లి, కొత్తూరు, గొట్టివలస, బురదవెంకటాపురం, ఉల్లిభద్ర ఎంపీటీసీ అభ్యర్థులు తెర్లి ఎల్లంనాయుడు, రేగిడి రామలక్ష్మి, వెలమల సంధ్య, కలిశెట్టి ఇందుమతి, శెట్టి ధనుంజయరావు, జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్‌ మరిశల్ల బాపూజీనాయుడు, మండల కన్వీనర్‌ కేతిరెడ్డి అచ్యుతరావు, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. – గరుగుబిల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement