గజపతినగరం: మెంటాడ జంక్షన్ రోడ్డులో ఓ ఇంట్లో మెరుగు పేరిట బంగారం చోరీ జరిగిన సంఘటన చోటు చేసుకున్నట్టు ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్‌నాయుడు శనివారం తెలిపారు. మెంటాడ రోడ్డు జంక్షన్‌లో శనివారం ఉదయం గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు పట్టీలు మెరుగు పెడతామంటూ పురిటిపెంట చర్చి వీధిలో వెత్సా గాయిత్రి ఇంటికి వెళ్లారు. గాయిత్రి వారి మాయ మాటలు నమ్మి ముందు పట్టీలను మెరుగు పరిచేందుకు ఇచ్చింది. తరువాత పట్టీలు మెరిసేలా చేయడంతో బంగారాన్ని కూడా మెరుగు పెడతామని ఆమెను నమ్మబలికారు. దీంతో ఆమె తన మెడలో ఉన్న రెండు తులాల బంగారు గోలుసును ఒకరి చేతిలో పెట్టింది. ఇంతలో ఆమె ఇంట్లోకి రాగా ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయమై సదరు మహిళ గాయిత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. అయితే నిందితులు సీసీ పుటేజిల్లో నమోదయ్యారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడిపై పీడీ యాక్ట్
విజయనగరం టౌన్: జిల్లాలో తెర్లాం మండలం రంగప్పవలస గ్రామానికి చెందిన సిగిలి వెంకటేష్(29) తరచూ గంజాయి అక్రమ రవాణాకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో అతనిపై పీడీ యాక్ట్ అమలుచేసి, శనివారం విశాఖ కేంద్ర కారాగారానికి పంపించినట్లు ఎస్పీ ఎఆర్.దామోదర్ ప్రకనటలో తెలిపారు. సిగిలి వెంకటేష్‌పై ఇప్పటికే తెర్లాం పోలీస్‌స్టేషన్‌లో ఒకటి, బుదరాయవలస పోలీసుస్టేషన్ పరిధిలో ఒకటి మొత్తం రెండు గంజాయి కేసులు నమోదయ్యాయన్నారు. ఆయా కేసుల్లో నిందితుడు నుంచి మొత్తం 16 కిలోల 570 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడు తన నేర ప్రవత్తిని మార్చుకోకుండా పదే పదే గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నందున, నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అతనిపై పీడీ యాక్ట్ కింద నిర్బంధ చర్యలను బొబ్బిలి రూరల్ సీఐ మల్లిఖార్జునరావు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతూ పదే పదే నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేరాల నియంత్రణ, ముందస్తు నేర నియంత్రణ చర్యల్లో భాగంగా నిందితుడు వెంకటేష్‌ను అదుపులోకి తీసుకుని ఏడాది వరకూ బెయిల్ రాకుండా చర్యలు చేపట్టి, అతన్ని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించామన్నారు.
జేఎన్టీయూ జీవీలో జాతీయ ఐక్యత దినోత్సవం
విజయనగరం రూరల్: స్థానిక జేఎన్టీయూ జీవీలో జాతీయ ఐక్యతా దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్వవిద్యాలయ ఉప కులపతి ప్రొఫెసర్ వి.వి.సుబ్బారావు ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ సమైక్యత, ఐక్యత, సమగ్రత, దేశ సమగ్రతను కాపాడటంలో ప్రతి ఒక్కరి బాధ్యతను వివరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ ఐక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రిజిస్ట్రార్ కె.సి.బి.రావు, విశ్వవిద్యాలయ వివిధ డైరెక్టర్లు, విభాగాధిపతులు, బోధన, బోధనేతర సిబ్బంది, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు, వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
‘రన్ ఫర్ యూనిటీ’ ర్యాలీ
డెంకాడ: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకుని, జాతీయ ఐక్యతా దినోత్సవంలో భాగంగా చింతలవలస ఏపీఎస్పీ ఐదో బెటాలియన్ పోలీసులు శనివారం రన్ ఫర్ యూనిటీ ర్యాలీ శనివారం నిర్వహించారు. దేశ సమగ్రతను కాపాడడం కోసం అందరం ఐక్యంగా మెలగాలని, దేశ రక్షణకు, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని కమాండెంట్ వై.రవిశంకర్‌రెడ్డి కోరారు. అనంతరం రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేశారు. కార్యకమ్రంలో అడిషనల్ కమాండెంట్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


