మీకు అండగా.. నేనుంటా... | - | Sakshi
Sakshi News home page

మీకు అండగా.. నేనుంటా...

Nov 1 2026 12:39 AM | Updated on Nov 1 2026 12:39 AM

మీకు అండగా.. నేనుంటా...

● స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని

గెలిపించండి

● శాసనమండలి విపక్ష నేత

బొత్స సత్యనారాయణ

మెరకముడిదాం:

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి గెలిపించాలని.. మీకు అండగా నేనుంటానని.. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మండలంలోని ఉత్తరావల్లి, సోమలింగాపురం గ్రామాల్లో శనివారం పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెండు గ్రామాల్లో జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని గుర్తెరిగి ఓటు వేయాలన్నారు. మండలంలో అన్ని ఎంపీటీసీ స్థానాలతో పాటు జెడ్పీటీసీ స్థానంలో కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. కూటమి నాయకులు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని, ఆ హామీలన్నీ గాలిలో కలిసిపోయాయని ఎద్దేవా చేశారు.

వైఎస్సార్‌సీపీలో పలువురి చేరిక

సోమలింగాపురంలో నిర్వహించిన ప్రచార సభలో మెరకముడిదాం గ్రామానికి చెందిన 20 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. వీరికి శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అదే గ్రామానికి చెందిన పలు కుటుంబాలు వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలిపాయి. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎస్‌వీ రమణరాజు, తాడ్డి వేణుగోపాలరావు, సరిది రమేష్‌, పిన్నింటి సుగుణాకరరావు, పార్టీ అభ్యర్థులు శిరువూరు కుసుమప్రియ, అడ్డాల అరుణ, కొమ్ము రమ్య, పల్లి ఉమామహేశ్వరరావు, నాయకులు, అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు, కొమ్ము శంకరరావు, ఎస్‌.కృష్ణమూర్తిరాజు, జంపన సావిత్రి, బోనెల గోపి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement