బ్యానర్‌... | - | Sakshi
Sakshi News home page

బ్యానర్‌...

Nov 1 2026 12:33 AM | Updated on Nov 1 2026 12:33 AM

●ఏటా పన్ను పెంపు ●ప్రభుత్వ ఆదేశాల మేరకు.. క్యాపిటల్‌ ఆధారంగా..

● ఇచ్చిన మాట తప్పిన ‘కూటమి’

● పట్టణ ప్రజలపై పన్నుల వడ్డింపు

● కనీస వసతులు కల్పించని వైనం

మున్సిపాల్టీలో ఆస్తులు విలువ గతంలో కంటే భారీగా పెంచేశారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ విలు వ ఆధారంగా ఇంటిపన్ను, ఖాళీ స్థలాలకు పన్నులు వసూలు చేస్తున్నారు. ఖాళీ స్థలాలకు భారీగా పన్నులు వసూలు చేయడం దారుణం. ఈ స్థాయిలో పన్నుల భారం వేసిన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు. పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం ఆ స్థాయిలో వార్డుల్లో మౌలిక వసతులు కల్పించడంలేదు.

– బి.వెంకటరమణ, రాజాం

ఇంటి పన్నులు, ఖాళీ స్థలాలకు పన్నుల చెల్లింపు కార్యక్రమం ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరుగుతోంది. ఏటా మున్సిపాల్టీలో 0.15 శాతం పెరుగుదల ఉంటుంది. క్యాపిటల్‌ విలు వ ఆధారంగా ఈ వసూళ్లు జరుగుతున్నాయి.

– ఎ.రామచంద్రరావు,

మున్సిపల్‌ కమిషనర్‌, రాజాం

● విద్యుత్‌ చార్జీల మోత

విద్యుత్‌ చార్జీలు గతంలో కంటే భారీగా పెరిగాయి. గతంలో సాధారణ కుటుంబాలకు రూ.130 నుంచి రూ.150లు వచ్చే విద్యుత్‌ బిల్లు ఇప్పుడు రెట్టింపైంది. సర్‌చార్జీల పేరుతో అదనపు వసూళ్లు చేస్తుండడంతో విద్యుత్‌చార్జీలు కట్టలేక పట్టణాల్లో నివాసం ఉంటున్న కార్మికులు, రోజువారీ కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. రెండు లైట్లు, ఒక ఫ్యాన్‌ వినియోగిస్తే నెలకు రూ.350లు దాటి విద్యుత్‌ బిల్లులు వస్తోందని గగ్గోలు పెడుతున్నారు. పన్నులు, విద్యుత్‌చార్జీల పెంపుపై మండిపడుతున్నారు.

రాజాం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టణ ప్రజలపై పన్నుల భారం అమాంతం పెరిగింది. ఇళ్లు, ఖాళీ స్థలాలకు పన్నుల వడ్డింపుతో పట్టణవాసుల జేబులకు చిల్లుపడుతోంది. మరోవైపు రెండున్నరేళ్లుగా నగరం, పట్టణాల్లో కనీస సదుపాయాల కల్పనలో ప్రభుత్వం నిర్లక్ష్యం నటిస్తోంది. గతంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇచ్చేది. క్యాపిటల్‌ ఆధారంగా చెల్లింపులు కట్టడిచేసేది. ఫలితంగా మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో ఇంటిపన్ను వసూళ్లు అంతంత మాత్రంగానే ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఏటా 15 శాతం మేర ఇంటిపన్ను వసూళ్లు అధికమైంది.

ఏటా పట్టణాల్లో ఖాళీ స్థలాలకు రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి విలువను నిర్థారిస్తున్నారు. చదరపు అడుగు లు ఆధారంగా మున్సిపాల్టీలో 0.20 శాతం, కార్పొ రేషన్లులో 0.50 శాతం పన్ను నిర్ధారిస్తున్నారు. 2021–23 మధ్య కాలంలో రాజాం మున్సిపాల్టీలో 375 చదరపు అడుగులు ఉండే ఖాళీ స్థలానికి రూ.4 లక్షలు మార్కెట్‌ విలువ ఉండేది. ఇప్పుడు ఆ ధర రూ.8 లక్షలకు చేరింది. ఈ క్యాపిటల్‌ ఆధారంగా గతంలో ఈ స్థలానికి చెల్లించే రూ.800లు పన్నును ఇప్పుడు రూ.1600లు చెల్లించాల్సి వస్తోంది. ఇలా ఖాళీ స్థలాలకే కాకుండా ఇంటికి సైతం పన్ను చెల్లింపు ఏటా గతంలో చెల్లించినదానికంటే 15 శాతం పెంచుతూ వస్తున్నారు. మరో వైపు ఇంటి నిర్మాణాలు సక్రమంగా లేవని, క్రమబద్ధీకరించుకోవాలని, నాలాకు పర్మిషన్‌లేదనే షాకులతో అదనపు వసూళ్లు అధికమయ్యాయి. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఇంటిపన్నుభారం ఉండదనే హామీని గాలికొదిలేసింది. పట్టణ ప్రజలపై పన్నుల భారం వేస్తూ అవస్థలకు గురిచేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement