వేధింపులు తాళలేకే.. వైఎస్సార్‌సీపీలోకి... | - | Sakshi
Sakshi News home page

వేధింపులు తాళలేకే.. వైఎస్సార్‌సీపీలోకి...

Oct 28 2026 5:54 AM | Updated on Oct 28 2026 5:54 AM

● మాజీ ఎమ్మెల్యే కళావతి సమక్షంలో 60 కుటుంబాల చేరిక

భామిని: మండలంలో ఘనసరకు చెందిన జనసేన మండల ప్రధాన కార్యదర్శి మడపాన అనిల్‌కుమార్‌తో పాటు 15 కుటుంబాలు ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో మంగళవారం చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. అలాగే బురుజోల, సింగిడికి చెందిన టీడీపీ నాయకులు బోపు రాజారావు, కోస్టు రామారావు, మాని నూకయ్యతో పాటు 45 కుటుంబాలు ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. బురుజోలలో జరిగిన కార్యక్రమంలో వీరికి పార్టీ కండువాలు వేసి మాజీ ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి తోట సింహాచలం, పార్టీ అధ్యక్షుడు బోదెపు శ్రీనివాసరావు, మండల నాయకుడు బోనగడ్డి ధర్మారావు, బోదెపుల సారధ్యంలో మాజీ ఎమ్మెల్యే వీరికి స్వాగతం పలికారు. జనసేన, టీడీపీ నేతల వేధింపులు తాళలేకే ఆయా పార్టీలను వీడినట్టు స్పష్టం చేశారు. పార్టీ నాయకులు మడపాన కేశవరావు, కిల్లారి ఫల్గుణ, వలరౌతు గిరిబాబు, రొక్కం ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement