నూతిలో వ్యక్తి మృతదేహం | - | Sakshi
Sakshi News home page

నూతిలో వ్యక్తి మృతదేహం

Oct 25 2026 12:59 AM | Updated on Oct 25 2026 12:59 AM

వేపాడ: వేపాడ రెడ్డివారి కళ్లాల వద్ద గల నూతిలో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. శనివారం చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. వల్లంపూడి గ్రామానికి చెందిన మోర్చా విజయ్‌ (32) కొంతకాలంగా తాగుడుకు బానిసై డబ్బుల కోసం కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల కిందట ఆత్మహత్య చేసుకుంటానని చెబుతూ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇంతలో రెడ్డివారి కళ్లాల వద్ద గల నూతిలో ఓ వ్యక్తి మృతదేహం తేలి ఉండడాన్ని స్థానికులు గుర్తించగా.. కుటుంబ సభ్యులు వచ్చి విజయ్‌గా గుర్తించారు. మృతుడి బంధువు కొమ్మనాపల్లి జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎస్‌.సుదర్శన్‌ కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్‌.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement