వివేకానందుని స్ఫూర్తితో ముందుకు సాగాలి | - | Sakshi
Sakshi News home page

వివేకానందుని స్ఫూర్తితో ముందుకు సాగాలి

Sep 26 2026 1:20 AM | Updated on Sep 26 2026 1:20 AM

● యువతకు కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి పిలుపు

● ఉత్సాహంగా యువజనోత్సవ పోటీలు

పార్వతీపురం రూరల్‌: స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. 2027 జనవరి 12న ఢిల్లీలో జరగనున్న జాతీయ యువజన దినోత్సవ ఎంపిక పోటీల్లో భాగంగా పార్వతీపురం జూనియర్‌ కళాశాలలోని ‘మన్యం కళావేదిక’పై సెట్విజ్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజనోత్సవ పోటీలను శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్‌ మాట్లాడుతూ ఇక్కడ ఎంపిౖకైన వారు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో అద్భుత ప్రదర్శన కనబరిచేలా అధికారుల ఆధ్వర్యంలో పకడ్బందీ శిక్షణ అందించాలని ఆదేశించారు. ఐదు విభాగాల్లో జరిగిన పోటీల్లో యువతీయువకులు ప్రతిభను చాటారు. జానపద నృత్యాల్లో సాలూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, జానపద గీతాల్లో పార్వతీపురం జూనియర్‌ కళాశాల విద్యార్థులు ప్రథమ స్థానాల్లో నిలిచారు. వీధి నాటకాల్లో బి.అఖిషేక్‌ బృందం, కవిత్వంలో వి.హాసిని (శ్రీ సాయిరాం డిగ్రీ కళాశాల), చిత్రలేఖనంలో కె.విష్ణుప్రియ (పీఎస్‌ఎం వాసవీ జూనియర్‌ కళాశాల) తొలి బహుమతులు కై వసం చేసుకున్నారు. ద్వితీయ స్థానాల్లో టీఆర్‌ఎంఎం విద్యార్థులు (నృత్యం), శ్రీరామ్‌ డిగ్రీ కళాశాల (గీతాలు), బి.ఈశ్వరరావు బృందం (నాటకం), ఎస్‌.ఎం.నికిత (కవిత్వం), ఏ.శ్యామల (పెయింటింగ్‌) నిలిచారు. కార్యక్రమంలో సెట్విజ్‌ సీఈఓ వి.వి.అప్పలనాయుడు, ఇంటర్మీడియట్‌ అధికారి హరప్రసాద్‌, డీఈఓ బ్రహ్మాజీ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement