నాగావళి వరదనీరు తీర గ్రామాల్లో అలజడి సృిష్టించింది. తోటపల్లి బ్యారేజీ నుంచి ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా 45వేల క్యూసెక్యుల పైబడి వరదనీటిని కిందకు విడిచిపెట్టడంతో ఒక్కసారిగా నాగావళి పొంగిపొర్లింది. తీర గ్రామాలను ముంచేసింది. అంపిలి, అన్నవరం, ఎరకరాయపురం, మంగళాపురం గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మరోవైపు కొండాపురం, అన్నవరం, వడమ, తంపటాపల్లి, గోపాలపురం, తదితర గ్రామాలకు చెందిన వేలాది ఎకరాల వరి పంట నీటమునిగింది. పాలకొండ సబ్‌కలెక్టర్ పవర్ స్వప్నిల్, డీఎస్పీ రాంబాబుల ఆధ్వర్యంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృంధాలు వరద సహాయక చర్యలు చేపట్టాయి. అన్నవరంలో తొమ్మిది నెలల గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో లైవ్‌బోటుల ద్వారా ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు తీసుకువచ్చి ఆస్పత్రిలో చేర్పించాయి. సాయంత్రం నుంచి వరద తగ్గుముఖం పట్టినా తీర గ్రామాల్లో వరదనీరు తగ్గలేదు.


