నిర్వాసితులను నిరాశ్రుయులను చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

నిర్వాసితులను నిరాశ్రుయులను చేయొద్దు

Sep 26 2026 1:20 AM | Updated on Sep 26 2026 1:20 AM

పాలకొండ రూరల్‌:

తుపాను ప్రభావంతో నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన వైఎస్సార్‌సీపీ నాయకులతో వరద ముంపు ప్రాంతాలైన అన్నవరం, అంపిలి, గోపాలపురం తదితర గ్రామాల్లో పర్యటించారు. నీట మునిగిన పంటలు, ఆయా గ్రామాల రైతుల, ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విక్రాంత్‌ మాట్లాడుతూ.. తుపాను ప్రభావంతో పాలకొండ నియోజకవర్గంలో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. తక్షణమే చంద్రబాబు ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలని కోరారు. పారిశుధ్య నిర్వహణ, విద్యుత్‌, తాగునీటి సరఫరా తక్షణమే పునరుద్ధరించాలన్నారు. ఆయనతో పార్టీ పట్టణ అధ్యక్షుడు వెలమల మన్మథరావు, మాజీ కౌన్సిలర్లు దుప్పాడ పాపినాయుడు, కడగల వెంకటరమణ, తుమ్మగుంట శంకరరావు, కోడెం విజయ్‌కుమార్‌, కిల్లారి మోహనరావు, పల్లా భాను, తూముల లక్ష్మణరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement