నింగినంటిన నిత్యవసరాల ధరలతో సామాన్యుల బతుకులు అగమ్యగోచరంగా మారాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా నేతలు ఆర్.శ్రీదేవి, బి.లక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పార్వతీపురంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. అన్ని వస్తువుల ధరలు 50 శాతానికి పైబడి పెరగడంతో పేద, మధ్యతరగతి జీవనం దుర్భరంగా మారిందన్నారు. రేషన్ డిపోల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులను తక్కువ ధరలకే అందించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ శక్తులు, దళారుల బ్లాక్ మార్కెట్‌కు కళ్లెం వేసి, ధరలను అరికట్టకపోతే ప్రజాసంఘాల భాగస్వామ్యంతో ఆందోళనను రాష్ట్రస్థాయిలో ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


