● భూ హక్కు పత్రాలు అందజేయండి | - | Sakshi
Sakshi News home page

● భూ హక్కు పత్రాలు అందజేయండి

Sep 8 2026 1:41 AM | Updated on Sep 8 2026 1:41 AM

● భూ హక్కు పత్రాలు అందజేయండి

జిల్లాలోని నిరుపేదలు, గిరిజనులు ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు పోడు, డీ– పట్టాలు మంజూరు చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో బాధితులు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. తరతరాలుగా కొండపోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం కుటుంబానికి 10 ఎకరాల వరకు పోడు పట్టాలు మంజూరు చేయాలని, ప్రభుత్వం అరకొరగా 30 నుంచి 50 సెంట్ల భూమినే అందజేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో సంఘ నేతలు రెడ్డి ఈశ్వరరావు, ఎం. శ్రీనివాసరావు, కొల్లి గంగునాయుడు, కూరంగి సీతారాం, ఎ.నాయుడు, బి.లక్ష్మి, పాలమెట్ట రాము, భూతాల మోహనరావు, గరుగుబిల్లి శ్రీనివాసరావు, సింహాచలం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement