● మాజీ ఎమ్మెల్యే జోగారావు
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించనున్న వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశానికి ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. పార్టీ అధినేత వైఎస్‌జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్ వీధిలోని ఆర్యవైశ్య కల్యాణ మంటపం వేదికగా సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ మేరకు క్యాంప్ కార్యాలయంలో నాయకులతో ఆదివారం సమావేశమైన మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సదస్సు సన్నాహాలపై చర్చించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడి సారథ్యంలో సాగే ఈ సమావేశానికి నాలుగు నియోజకవర్గాల సమన్వయకర్తలు, పరిశీలకులు విచ్చేయనున్నారు. రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులంతా సమరోత్సాహంతో కదలిరావాలని, సమావేశాన్ని విజయవంతం చేయాలని జోగారావు పిలుపునిచ్చారు.


