అంతర్జాతీయ వేదికపై ‘సురవరం యువకుడు’ | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ వేదికపై ‘సురవరం యువకుడు’

Sep 7 2026 3:08 AM | Updated on Sep 7 2026 3:08 AM

అంతర్జాతీయ వేదికపై ‘సురవరం యువకుడు’

సంతకవిటి: మండలంలోని సురవరం గ్రామానికి చెందిన డాక్టర్‌ బాసా మురళి కళారంగంలో పరిశోధనా దృక్పథంతో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యం నుంచి ప్రారంభమైన ఆయన విద్య, కళా ప్రయాణం నేడు జాతీయ, అంతర్జాతీయ అకడమిక్‌ వేదికల వరకు చేరుకోవడం విశేషం. ప్రస్తుతం ఆయన అస్సాం రాష్ట్‌ల్రంలోని సిల్చార్‌లో ఫెర్ఫార్మింగ్‌ అండ్‌ ఆర్ట్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. నటన, థియేటర్‌ పెడగాజి, శరీర ఆధారిత నటనా పద్ధతులు వంటి అంశాలపై ఆయన పరిశోధనలు చేస్తున్నారు. ఇటీవల సెప్టెంబర్‌ 2 నుంచి 4 వరకు శ్రీలంకలోని జాఫ్నా యూనివర్సిటీలో సర్‌ పొన్నంబాలెం రామనాథన్‌ ఫ్యాకల్టీ ఆఫ్‌ విజవల్‌ అండ్‌ ఫెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ విభాగంలో జరిగిన మూడో అంతర్జాతీయ రీసెర్చ్‌ కాన్ఫరన్స్‌లో ఆయన పాల్గొన్నారు. విజవల్‌ అండ్‌ ఆర్ట్స్‌ ఫెర్ఫార్మింగ్‌లో బోధనా శాస్త్రం, హెల్త్‌ ప్రాక్టీసెస్‌ అంశంపై జరిగిన సదస్సులో మురళీ తన పరిశోధనా పత్రం సమర్పించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్న మురళికి గ్రామస్తులు అభినందనలు తెలియజేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement