సీటు చూపించండి..! | - | Sakshi
Sakshi News home page

సీటు చూపించండి..!

Sep 7 2026 3:08 AM | Updated on Sep 7 2026 3:08 AM

ఇటువంటి ఉద్యోగాలను నమ్మొద్దు

జీతం

వద్దు

వీరఘట్టం: సార్‌ నమస్తే..నాకు మీ స్కూల్‌లో రికార్డు అసిస్టెంట్‌ ఉద్యోగం వచ్చింది..ఇదిగో అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌..మీరు నాకు జీతం ఇవ్వక్కర్లేదు..మా కంపెనీ వాళ్లే నాకు నెలకు రూ.15 వేలు జీతం ఇస్తారు..నా సీటు ఎక్కడో చెప్పండి అంటూ ఓ వ్యక్తి కొద్ది రోజుల క్రితం మండలంలోని ఓ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ హెచ్‌ఎంకు తనకు ఉద్యోగం వచ్చిందనే జాయినింగ్‌ ఆర్డర్‌ చూపించాడు. సారు నేను సోమవారం వస్తాను. ఉద్యోగంలో జాయిన్‌ అవుతానని హెచ్‌ఎంకు చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో సదరు హెచ్‌ఎం ఎవరీ వ్యక్తి..ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక కాసేపు నివ్వెరపోయాడు..కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది.

మండలంలోని కుమ్మరిగుంట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ‘స్ఫూర్తి ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ’ ద్వారా స్కూల్‌లో రికార్డు అసిస్టెంట్‌ ఉద్యోగం వచ్చిందని చూపించిన జాయినింగ్‌ ఆర్డర్‌ చూసిన హెచ్‌ఎం మాట్లాడుతూ ఇటువంటి ఉద్యోగాలు ఇక్కడలేవని ఆ వ్యక్తిని పంపించేశారు.అయితే ఆ వ్యక్తి మాత్రం నేను సోమవారం వస్తాను. నా కుర్చీ ఎక్కడో చెప్పండి అని చెప్పి వెళ్లిపోవడంపై హెచ్‌ఎం కొంత ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని పాలకొండ ఉప విద్యాశాఖాధికారి పర్రి కృమూర్తికి, డీఈఓ పి.బ్రహ్మాజీరావుకు తెలియజేశారు.ఈ విషయంపై జిల్లా విద్యాశాఖాధికారులు వెంటనే స్పందించారు.అటువంటి జాయినింగ్‌ ఆర్డర్లు తెస్తే ఎవ్వరినీ జాయిన్‌ చేసుకోవద్దని హెచ్‌ఎంకు సూచించారు.

అవి ఫేక్‌ ఆర్డర్లు..

గత రెండేళ్లుగా కొన్ని బోగస్‌ సంస్థలు నిరుద్యోగులకు గాలం వేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులు, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో నియమిస్తున్నామంటూ నిరుద్యోగులను ఈ ఉచ్చులోకి లాగుతున్నాయి.ఓ పోస్టుకు రూ.2 లక్షల నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేస్తున్నారు.సదరు పాఠశాలల్లో జాయిన్‌ అయ్యేవారికి రెండు నెలల పాటు జీతాలు ఇవ్వడం,అంతలోనే బోర్డు తిప్పేయడం రెండేళ్ల క్రితం ఇటువంటి బోగస్‌ ఉద్యోగాల బాగోతం వీరఘట్టం మండలంలోని పలు హైస్కూల్స్‌లో వెలుగు చూసింది. వారంతా సదరు బోగస్‌ కంపెనీల పేరుతో ఇటువంటి ఫేక్‌ ఆర్డర్లు సృష్టిస్తూ అమాయక నిరుద్యోగులను దోచుకుంటున్నారు.ఇటువంటి ఉదంతాలు వెలుగు చూస్తున్నా పలువురు నిరుద్యోగులు ఇటువంటి వారి ఉచ్చులో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోతున్నారు.బోగస్‌ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు గాలం వేస్తున్నవారిపై కఠిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

పాఠశాలల్లో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ఉద్యోగాలు ఇస్తామంటూ ఎవరైనా చెబితే అటువంటి వారిని నమ్మవద్దు. గతంలో ఇదే విధంగా ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు అక్రమగా వసూలు చేసిన సంఘటనలు వెలుగుచూశాయి. నిరుద్యోగ యువత అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఎవరైనా జాయినింగ్‌ ఆర్డర్లు తెస్తే ప్రధానోపాధ్యాయులు వెంటనే ఆ విషయాన్ని తెలియజేయండి.

పి.బ్రహ్మాజీరావు, డీఈఓ, పార్వతీపురం మన్యం

హైస్కూల్‌లో తాను స్వచ్ఛందంగా

పనిచేస్తానని ఆ వ్యక్తి ఇచ్చిన లెటర్‌

స్ఫూర్తి ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ పేరిట ఇచ్చిన

జాయినింగ్‌ ఆర్డర్‌

సార్‌ నాకు మీ స్కూల్‌లో ఉద్యోగం వచ్చింది

ఓ స్వచ్ఛంద సంస్థ ఆర్డరు ఇచ్చింది

ఫేక్‌ అపాయింట్‌మెంట్‌తో పాఠశాలకు వచ్చిన వ్యక్తి

నివ్వెరపోయిన హెచ్‌ఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement