● 1008 బిందెల నీటితో శివయ్యకు జలాభిషేకం
వీరఘట్టం: వరుణుడు కరుణించి వర్షాలు కురిపించాలని కోరుతూ వీరఘట్టం మండలం చిదిమి గ్రామానికి చెందిన మహిళలు గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ పార్వతీ సమేత కాశీసుందర విశ్వేశ్వరస్వామికి సోమవారం పూజలు చేశారు. ఈ మేరకు గ్రామ సమీపంలో ఉన్న నాగావళి నది వెళ్లి పవిత్ర స్నానాలు ఆచరించి బిందెలతో నీటిని తెచ్చి శివాలయం గోపురానికి జలాభిషేకం చేశారు. ఆలయ ధర్మకర్త, వీరఘట్టం ఎంపీపీ దమలపాటి వెంకటరమణ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ ఉమామహేశ్వరరావు, జలవనరులశాఖ డీఈఈ రవికుమార్ పర్యవేక్షణలో గ్రామస్తులంతా ఓం నమః శివాయ, శంభో శంకర అంటూ స్మరిస్తూ శిఖరానికి జలాభిషేకం చేశారు.ఆలయ అర్చకుడు ఎస్.గోపీశర్మ ప్రత్యేక పూజలు చేయడంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.


