హోదా ఆకాశమంత.. మనసు ప్రజల చెంత! | - | Sakshi
Sakshi News home page

హోదా ఆకాశమంత.. మనసు ప్రజల చెంత!

Aug 15 2026 12:58 AM | Updated on Aug 15 2026 12:58 AM

హోదా ఆకాశమంత.. మనసు ప్రజల చెంత! వైద్య విద్య నుంచి సివిల్స్‌ వరకు.. ‘నేను అధికారి’ అనే భావనే లేదు...

దర్పం లేని దరహాసం.. ఇన్‌చార్జి జేసీ వైశాలి ప్రత్యేకత ఐఏఎస్‌ హోదా ఉన్నా.. సామాన్యురాలిగానే యువ అధికారిణి సమస్యల పరిష్కారంలో తనదైన శైలి..

నంగా కూర్చుని సర్దిజెప్పేసరికి వారి ఆందోళనను తక్షణం విరమించారు. ఒక ఐఏఎస్‌ అధికారి ఇలా చేయడం చూసినవారికి తొలుత ఆశ్చర్యం కలగొ చ్చు. కానీ వైశాలికి మాత్రం అది ప్రత్యేకమైన విష యం కాదు. హోదా కుర్చీలో ఉంటుంది.. మనిషి మాత్రం అందరిలో ఒకరే అన్నది ఆమె తీరు చెప్పే సందేశం.

సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వైశాలి.. డాక్టర్‌ విద్యను అభ్యసించి, ఆ తర్వాత సివిల్స్‌ వైపు రావడం వెనుక ఉన్న ఆలోచన కూడా సేవాభావాన్నే ప్రతిబింబిస్తుంది. వైద్యురాలిగా కొంతమంది జీవితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. పరిపాలనా వ్యవస్థలోకి వస్తే ఒక ప్రాంతంలోని వేలాది మంది జీవితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని చెబుతుంటారు. వైశాలిది తమిళనాడు రాష్ట్రం చెంగళ్పట్టు జిల్లాలోని ఓ గ్రామం. నాన్న రామమూర్తి రైస్‌ మిల్లులు నిర్వహిస్తారు. అమ్మ గృహిణి. సోదరి వైష్ణవి. ఇద్దరూ ఎండీఎస్‌ పూర్తి చేశారు. పీజీ పూర్తయిన తర్వాత దంత వైద్యశాల నిర్వహిస్తూనే.. యూపీఎస్సీ పరీక్షలు రాశారు. నాలుగో ప్రయత్నంలో ఆమె ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. తొలుత గుజరాత్‌ రాష్ట్రానికి కేటాయించా రు. 2025లో వివాహానంతరం ఏపీ కేడర్‌కు బదిలీ అయ్యారు. ఆమె భర్త పవర్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ కూడా ఐఏఎస్‌నే. ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఐటీడీఏ పీఓగా ఉన్నారు. ఆయన సైతం సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వారే. తండ్రి ఆటో డ్రైవర్‌. అందుకేనేమో హోదా ఎంత పెరిగినా.. ఇంకా వారి మనసు సామాన్యుల మాది రి ఆలోచిస్తోంది. అధికారాన్ని ప్రజలకు దూరం చేసే సాధనంగా కాకుండా, ప్రజలకు మరింత చేరు వ చేసే అవకాశంగా ఈ దంపతులు ఉపయోగిస్తున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

సాక్షి, పార్వతీపురం మన్యం:

ఏఎస్‌ అధికారి అంటే.. చుట్టూ సిబ్బంది.. ముందూ వెనుకా ప్రొటోకాల్‌.. అధికార దర్పం.. హోదాకు తగ్గట్టుగా ప్రత్యేక వ్యవహారశైలి.. సాధారణంగా కనిపించే దృశ్యాలు ఇవే. అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తారు పార్వతీపురం మన్యం జిల్లా ఐటీడీఏ పీఓ, ఇన్‌చార్జి సంయుక్త కలెక్టర్‌ ఆర్‌.వైశాలి. పదవి ఎంత పెద్దదైనా.. మనిషిగా మాత్రం తాను అందరిలో ఒకరినే అన్నట్టుగా వ్యవహరిస్తా రు. సాధారణ వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన ఆమె.. డాక్టర్‌ విద్యను అభ్యసించారు. వైద్య వృత్తి లో స్థిరపడే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రజలకు మరింత విస్తృతంగా సేవ చేయాలన్న ఆసక్తితో సివి ల్స్‌ వైపు అడుగులు వేశారు. 2023 బ్యాచ్‌కు చెందిన వైశాలి... ఐఏఎస్‌ అధికారిణిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆమెలో ఆ నిరాడంబరత ఏ మాత్రమూ మారలేదు.

పదవి ఆమెను పైకి తీసుకెళ్లింది.. కానీ మానవత్వం మాత్రం ప్రజల మధ్యే ఉంచింది. ఇదే.. ఒక మంచి అధికారిణికి అసలైన గౌరవం. ఆర్‌.వైశాలి వ్యవహా ర శైలిని దగ్గరగా చూసిన వారికి ముందుగా కనిపించేది ఆమె నిరాడంబరతే. అధికార హోదా ఉన్నప్పటికీ దాన్ని ఎక్కడా ప్రదర్శించాలన్న తాపత్రయం కనిపించదు. ఉద్యోగులతో మాట్లాడినా.. ప్రజలను కలిసినా.. ఆమె వ్యవహారంలో ఒక సహజత్వం కనిపిస్తుంది. ఉద్యోగులు నేలపై కూర్చొని ఏదైనా పని చేస్తున్నప్పుడు.. వారిని పైకి లేపి తాను కుర్చీలో కూర్చోవడం కాదు.. అవసరమైతే తానే వారితో

పాటు నేలపై కూర్చొని పనిని సమీక్షిస్తారు. సర్‌ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించిన ఆమె.. అందులో భాగంగా పాచిపెంట మండలంలో పర్యటించారు. ఓ గ్రామంలో కమ్యూనిటీ హాలు వద్ద, మరో చోట అంగన్‌వాడీ కేంద్రంలోనూ సిబ్బందితో పాటు, నేల మీదే కూర్చుని పరిస్థితిని సమీక్షించా రు. ఆ సమయంలో తాను ఒక ఐఏఎస్‌ అనే దర్పం ఆమెలో ఇసుమంతైనా కనిపించలేదు.

ఇటీవల గిరిజన గర్భిణుల వసతి గృహంలో పని చేసి, తొలగింపునకు గురైన పలువురు ఏఎన్‌ఎంలు పార్వతీపురం ఐటీడీఏ వద్ద నేలపైనే బైఠాయించి, ధర్నా చేపట్టారు. జోరున వర్షం కురిసినా అక్కడ నుంచి లేవలేదు. రాత్రయినా అక్కడ నుంచి కదలలేదు. తమకు స్పష్టమైన హామీ కావాలని పట్టుబట్టారు. ఆ సమయంలో విషయం తెలుసుకున్న పీఓ.. వారి వద్దకే నేరుగా వెళ్లి, వారితో పాటు సమానంగా కింద కూర్చుని సమస్యలను సావధానంగా విన్నారు. రెండు వారాలు తనకు సమయం ఇవ్వాలని.. ఈ వేళలో ఇక్కడ కూర్చుని ఇబ్బంది పడవద్దని నచ్చజెప్పారు. జేసీ అంతటి అధికారి తమతో సమా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement