కలెక్టర్‌ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

Aug 15 2026 12:58 AM | Updated on Aug 15 2026 12:58 AM

కలెక్టర్‌ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అక్కా.. బావ గారి ఆరోగ్యం ఎలా ఉంది.. ● మాజీ ఎమ్మెల్యే కళావతిని ఫోన్‌లో పరామర్శించిన మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

పార్వతీపురం: జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధు లు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు కలెక్ట ర్‌ డా.ఎన్‌. ప్రభాకరరెడ్డి శుక్రవారం ముందస్తు స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హర్‌ఘర్‌తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి, ఐక్యతను చాటాలని కోరారు. అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చా రు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు.

వీరఘట్టం: పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతికి శుక్రవారం మధ్యాహ్నం వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌ చేశారు. అక్కా... బావగారి ఆరోగ్యం ఎలా ఉందని పరామర్శించారు. కళావతి భర్త హరిప్రసాద్‌ గుండెపోటుకు గురికావడంతో ఈ నెల 10న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ జరిగింది. సమాచారం తెలుసుకున్న జగన్‌మోహన్‌రెడ్డి వైద్య ఏర్పాట్లు చేశారు. కళావతికి ఫోన్‌చేసి ధైర్యం చెప్పారు. ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి హరిప్రసాద్‌ ఆరోగ్యంపై ఆరా తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement