మెగా డీఎస్సీ వ్యవహారంలో జరిగిన అవకతవకలు, లీకేజీలపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరపాలి. ఈ వైఫల్యానికి కారణమైన విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలన్నది మా పార్టీ తరఫున ప్రధాన డిమాండ్. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని ఈ ప్రభుత్వం తుంగలో తొక్కింది. తక్ష ణమే ఆ భృతిని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. శ్రీకాకుళం ఘటనలో జరిగిన ఓ యాక్సిడెంట్ కేసును సాకుగా చూపి, కక్షసాధింపు చర్య ల్లో భాగంగానే అరెస్టులకు పాల్పడుతున్నారు. గురువారం విశాఖ విమానాశ్రయం నుంచి జైలు వరకు వైఎస్ జగన్ పర్యటనకు ఉత్తరాంధ్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పోలీసులు లాఠీచార్జి చేసి అడ్డుకున్నా వేలాదిగా జనం తర లిరావడమే చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకతకు నిదర్శనం. పార్టీలకతీతంగా అంతా జగన్ నాయకత్వాన్నే కోరుకుంటున్నా రు. ప్రభుత్వం ఇప్పటికై నా డీఎస్సీ దోషులపై చర్యలు తీసుకోవాలి.
–శరగడం చిన అప్పలనాయుడు,
పార్లమెంటు పరిశీలకులు


