పార్వతీపురం రూరల్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభా గం నూతన బాధ్యులను పార్టీ కేంద్ర కార్యాల యం ప్రకటించింది. పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపింది. ఈ మేరకు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా పల్లా అనంత నాయుడు నియమితులయ్యారు. కురుపాం నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడిగా ముంజి సురే ష్‌కు బాధ్యతలు అప్పగించారు. జిల్లాలోని వివి ధ నియోజకవర్గాల యువజన విభాగ సమన్వ యం, సంస్థాగత బాధ్యతల నిమిత్తం ఈ ప్రకటన విడుదల చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
భామిని: మండలంలో కొబ్బరి తోటల్లో గజరా జులు సంచరిస్తున్నాయి. బిల్లుమడలో కొబ్బరి తోటలను శుక్రవారం నాశనం చేశాయి. వంశ ధార నదీ తీరం వెంబడి నాలుగు ఏనుగుల గుంపు పంటలపై దాడులు చేశాయని రైతులు వాపోతున్నారు. గజరాజుల వరుస దాడులతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు.
పార్వతీపురం: జిల్లాలో మలేరియా, ఇతర జ్వరా ల నిర్మూలనకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి క్షేత్ర స్థాయిలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాల ని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జ్వరాల కేసులను గుర్తించి రాపిడ్ డయాగ్నస్టిక్ పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన మందులు, యాక్ట్ కిట్లు అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలలో అందుబాటులో ఉంచాలని సూచించారు. వైద్య శిబిరాల వివరా లు, రోగుల వ్యాధుల వర్గీకరణను ప్రతీ రోజూ ప్రొఫార్మా ప్రకారం నమోదు చేసి నివేదికలు పంపాలని, గ్రామాల్లో ఫ్రైడే – డ్రైడే కార్యక్ర మాన్ని సమర్ధవంతంగా నిర్వహించి, లార్వా నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. విధులు నిర్వహణలో నిర్లక్ష్యం వహి స్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎంహెచ్‌ఓ పి.విజయలక్ష్మి మాట్లాడుతూ గత నెలలో 1.25 లక్షలకు పైగా ఓపీ సేవలు అందించామని, జూలై 1 నుంచి 30వరకు 47,324 మందికి రాపిడ్ డయాగ్నస్టిక్ పరీక్షలు నిర్వహించినట్లు కలెక్టర్‌కు వివరించారు. సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్ష
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంత ర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులతో శుక్రవారం జూమ్ ద్వారా సమీక్ష నిర్వహించా రు. ప్రజలను సభా వేదికలకు తరలించే బస్సులు నిర్ణీత సమయానికి బయలుదేరి గమ్యస్థానానికి చేరేలా చర్యలు తీసుకోవాల ని ఆదేశించారు. బస్సుల్లో ఖాళీలు ఉంటే బఫర్ జాబితా నుంచి వెంటనే భర్తీ చేయాలని, ప్రయాణి కుల వివరాలను జిల్లా గ్రూపులలో వెంటనే పంపించాలని ఎంపీడీఓలకు ఆదేశించారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.


