మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై ఆధారాలతో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశాం. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌న్‌రెడ్డి బయటపెట్టిన ప్రతి అంశంపై స్పష్టమైన సమయపాలనతో విచారణ జరగాలి. నిరుద్యోగులు, విద్యార్థుల తరఫున పోరాడేందుకు మా పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుంది. ఎన్నికల్లో నిరు ద్యోగ భృతి ఇస్తామన్న కూటమి సర్కారు నేటికీ మోసం చేస్తూనే ఉంది. డీఎస్సీలో డబ్బులిచ్చి, అనర్హులను ఎంపిక చేసుకున్నారు. సీబీఐ విచారణ జరిపించాలి. ఈ విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే మంత్రి లోకేశ్ తన పదవి నుంచి తప్పుకోవాల్సిందే.
– పాలవలస విక్రాంత్, ఎమ్మెల్సీ


