సర్కారుపై సమరం | - | Sakshi
Sakshi News home page

సర్కారుపై సమరం

Jul 27 2026 1:30 AM | Updated on Jul 27 2026 1:30 AM

సర్కారుపై సమరం

జిల్లా కేంద్రంలో శాంతియుత నిరసన ర్యాలీ రేపు

డీఎస్సీ అక్రమాలపై యువత,

విద్యార్థులతో కలిసి నిలదీత

డీఎస్సీ నియామకాలపై సీబీఐతో విచారణ జరిపించాలి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన బకాయిలు చెల్లించాలి

రూ.3వేల నిరుద్యోగ భృతి చెల్లించాలి

జెడ్పీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ

విజయనగరం జిల్లా అధ్యక్షుడు

విజయనగరం:

న్నికలకు ముందు యువత, విద్యార్థులకు ఇచ్చిన హమీలను విస్మరించి మాయమాటలు, మోసకారి చర్యలతో పబ్బంగడుపుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై సమరశంఖం పూరించనున్నట్లు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 28న పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నిరసన ద్వారా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వహించిన డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలతో పాటు ఎన్నికలకు ముందు ప్రకటించిన హామీల విషయంలో చేస్తు న్న మోసంపై గళం విప్పనున్నామన్నారు. ఈ మేరకు ఆదివారం విజయనగరంలోని రింగ్‌రోడ్‌లో గల వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిరసన ర్యాలీకి సంబందించి వాల్‌పోస్టర్‌లను పార్టీ యు వజన విభాగం నాయకులతో కలిసి ఆయన ఆవి ష్కరించారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు విజయనగరంలోని మున్సిపల్‌ కార్యాలయం జంక్షన్‌ నుంచి గంటస్తంభం జంక్షన్‌, మెయిన్‌ రోడ్‌ మీదుగా మూడులాంతర్ల జంక్షన్‌ వరకు నిరసన సాగుతుందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో పాల్గొ ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సర్కారు మెడలు వంచేంత వరకు పోరటం

జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించి న నీట్‌ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీపై ఇటీవల ఢిల్లీ సహా దేశ వ్యాప్తంగా యువత, విద్యార్థులు చేపట్టిన పోరటంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింద ని అందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించారని మజ్జి శ్రీని వాసరావు గుర్తు చేశారు. ఇదే తరహాలో ఆఽంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తరువాత నిర్వహించిన డీఎస్సీ అక్రమాలపై చంద్రబాబు ప్రభుత్వం మెడలు వంచేందుకు యువత, విద్యార్థులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చిందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీలో అక్రమా ల ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో అందుకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను ఆ బాధ్యతలను తొలగించాలని డిమాండ్‌ చేశారు.

యువత, విద్యార్థులకు ఇచ్చిన హమీలు అమలు ఎప్పుడు..?

ఎన్నికలకు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు చంద్రబాబు సర్కారు ఇచ్చిన హమీలు ఎప్పుడు అమలు చేస్తారని మజ్జి శ్రీని వాసరావు ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేలు భృతి ఇస్తామని ప్రకటించి రెండేళ్లుగా గడుస్తున్నా అమలు చేయలేదన్నారు. అదే విధంగా ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకా యిల విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని దుమ్మెత్తిపోశారు. ఈ నేపథ్యంలో యువత, విద్యార్థుల భవిష్యత్‌ కోసం రాష్ట్రంలో బాధ్యత గల ప్రతిపక్షగా వైఎస్సార్‌సీపీ పోరుబాట పడుతుందని చె ప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ, పట్టణ స్థాయి నుంచి యువత, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

డీఎస్సీలో దగా: మాజీ ఎమ్మెల్యే అలజంగి

పార్వతీపురం రూరల్‌: ఉపాధ్యాయ నియామకాల్లో (డీఎస్సీ) జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన పార్వతీపురంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో డీఎస్సీ ప్రక్రియలో దొర్లిన బాగోతం, చోటుచేసుకున్న అక్రమాల గురించి ఇప్పటికే రాష్ట్రంలో ప్రజలందరికీ విధితమేనని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వ తీరుతో దగాపడ్డ నిరుద్యోగ యువత పక్షాన గళమెత్తేందుకు ఈ నెల 28న వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో పార్వతీపురంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు జోగారావు వెల్లడించారు. ఈ అక్రమాలపై ముక్తకంఠంతో నిలదీసేందుకు జరిగే ఈ పోరులో యువత పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

మజ్జి శ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement