● HIG‹ÜG‹œ Æ>çÙ‰ çÜàĶæ$ M>Æý‡Å-§ýl-ÇØ ˘
నాగభూషణం
విజయనగరం టౌన్: తల్లికి వందనం పథకాన్ని షరతులు, పరిమితులు లేకుండా అర్హుడైన ప్రతి విద్యార్థికి వర్తింపజేయాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయకార్యదర్శి ఎన్.నాగభూషణం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువులకు దూరం కాకుండా చేయడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. అటువంటి పథకానికి నిబంధనలు, సాంకేతిక కారణాలు పత్రాల లోపాలు, అర్హతల పేరుతో విద్యార్థులను దూరం చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా విద్యార్థులకు ఆర్థిక సాయమందాలంటే అమల్లో ఉన్న అన్ని అడ్డంకులను తొలగించి ప్రతి విద్యార్థికి పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా అర్హుల జాబితాలో పేర్లు లేకపోవడం, ఆధార్ లేదా బ్యాంక్ అనుసంధాన సమస్యలు, ఇతర సాంకేతిక కారణాలతో లబ్ధికోల్పోయిన విద్యార్థులందరికీ ప్రత్యేక అవకాశాన్ని కల్పించి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యను హక్కుగా గుర్తించి, పేద విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తల్లికి వందనం పథకాన్ని షరతుల్లేకుండా అమలు చేయాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి ఏఐఎస్‌ఎఫ్ ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు.


