సఖి వన్‌ స్టాప్‌ సెంటర్‌ పరిశీలన | - | Sakshi
Sakshi News home page

సఖి వన్‌ స్టాప్‌ సెంటర్‌ పరిశీలన

Jul 18 2026 9:57 AM | Updated on Jul 18 2026 9:57 AM

సఖి వన్‌ స్టాప్‌ సెంటర్‌ పరిశీలన

కేంద్రంలో అందుతున్న సేవలపై ఎస్పీ ఆరా

విజయనగరం క్రైమ్‌: కంటోన్మెంట్‌ పోలీస్‌ బ్యారెక్స్‌ను ఆనుకుని ఉన్న సఖి వన్‌ స్టాప్‌ సెంటర్‌ను ఎస్పీ దామోదర్‌ శుక్రవారం పరిశీలించారు.వన్‌స్టాప్‌ సెంటర్‌ ద్వారా బాధిత మహిళలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు, బాలికలకు అత్యవసర పరిస్థితుల్లో భద్రత, ఉచిత న్యాయ సహాయం, వైద్యసేవలు, మానసిక పరామర్శ, తాత్కాలిక ఆశ్రయం వంటి సమగ్ర సేవలను ఒకేచోట వన్‌ స్టాప్‌ సెంటర్‌ లో అందిస్తున్నామన్నారు. వన్‌ స్టాప్‌ సెంటర్‌లోని రిజిస్టర్‌లు, కేసుల నిర్వహణ విధానం, కౌన్సెలింగ్‌ సేవలు, న్యాయ సహాయం, వైద్య సేవల సమన్వయం, అత్యవసర స్పందన విధానాలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. సెంటర్‌ కు ఆశ్రయం కోసం వచ్చిన బాధిత మహిళలతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న సేవలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో మహిళా పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీ, పి.వి.వి.నరసింహారావు, సీఐ ఈ.నరసింహమూర్తి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, సెంటర్‌ అడ్మినిస్ట్రేటర్‌ పి.విజయలక్ష్మి, డొమెస్టిక్‌ వయోలెన్స్‌ సెల్‌ లీగల్‌ కౌన్సిలర్‌, మాధవి,సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement