జియ్యమ్మవలస రూరల్: కౌలు రైతులు ఎరువు కష్టాలు ఎదుర్కొంటున్నారు. బస్తా యూరియా ఇవ్వాలంటే కనీసం ఎకరం పొలం ఉండాలన్న ప్రభుత్వ నిబంధన కౌలు రైతులను ఆవేదనకు గురిచేస్తోంది. మరోవైపు ఎకరం లోపు విస్తీర్ణం ఉన్న రైతులు సైతం ఎరువు అందక ఇబ్బందులు పడుతున్నారు. జియ్యమ్మవలస మండలం బీజే పురం సచివాలయంలో గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు యూరియా కోసం వందల మంది రైతులు పడిగాపులు కాస్తే కేవలం 56 బస్తాలు మాత్రమే పంపిణీ చేశారు. ఫోన్ నంబర్ తెలియని వారు, ఫోన్‌లో బ్యాలెన్స్ లేని వారు, ఎవరెవరి పేరునో ఆధార్ లింక్ అయిన రైతులు ఓటీపీ చెప్పలేకపోవడంతో ఎరువు అందడంలేదు.


