ౖపైపె మెరుగులతో మ్యూజియం..!
నేడు ప్రారంభించనున్న గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి
ఏరియా ఆస్పత్రిని ప్రారంభించనున్న మంత్రి
● వైఎస్సార్‌సీపీ హయాంలోనే 80 శాతం పనుల పూర్తి
సీతంపేట: గిరిజన మ్యూజియానికి ౖపైపె మెరుగులేసి ప్రారంభించడానికి సన్నద్ధం చేశారు. సీతంపేటలోని పీఎంఆర్‌సీ (ప్రాజెక్టు మానిటరింగ్ రిసోర్స్ సెంటర్) పాత భవనానికి మెరుగులు దిద్దారు. హడావిడిగా మ్యూజియంలో కొంతసామగ్రి పెట్టి, గిరిజన గ్రామ వాతావరణం ఏర్పా టు చేయడానికి పూరిగుడిసె వంటివి నిర్మించి అక్కడ గిరిజనుల బొమ్మలు ఏర్పాటు చేస్తున్నా రు. పూలమొక్కలు వంటివి ముందు భాగంలో వేసి మ్యూజియం వాతావరణం కల్పించి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణితో ప్రారంభానికి సిద్ధం చేశారు. ఎనిమిదేళ్లుగా పూర్తిస్థాయిలో తర్చిదిద్దలేని మ్యూజియాన్ని ఒక్కరోజులో ఎలా చేశారో అధికారులకే ఎరుక. రూ.కోటి అంచనా వ్యయంతో 2017లో ఈ మ్యూజియానికి శంకుస్థాపన జరిగింది. 2018 ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాటికి పనులు పూర్తిచేసి ఆ రోజున మ్యూజియాన్ని ప్రారంభిస్తామని అప్పట్లో చెప్పారు. అనంతరం ఈ మ్యూజియానికి కావాల్సిన పరికరాలను, విలువైన సామగ్రిని ఒక గదిలో ఉంచారు. అయి తే అవి చెదలు పట్టి సగం వరకు పోయాయి. వివిధ రకాల బొమ్మలు తయారు చేసి అలాగే వదిలేశారు. అనంతరం మళ్లీ కొద్ది రోజుల కింద ట పనులు అరకొరగా చేపట్టారు. మంగళవారం ప్రారంభానికి సిద్ధం చేశారు.
ఇది పరిస్థితి..
8 రాష్ట్రాల్లో విస్తృతంగా గిరిజనులు నివసిస్తున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నివసించే గిరిజనులతోపాటు సీతంపేట ఏజెన్సీలో ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, మహరాష్ట్ర, బీహార్‌లలో ఉన్న ఆదివాసీలు, ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉండే ఆదివాసీల జీవన విధానం కంటికి కనిపించేలా బొమ్మల రూపంలో మ్యూజియంలో చూపించాలని నిర్ణయించారు. గిరిజనులు ఇంట్లో వాడే వస్తువులు, కట్టుబాట్లు, వేటాడే వస్తువులు, పూర్వం నుంచి ఇప్పటివరకు దశలవారీగా జరిగిన మార్పులను చిత్ర రూపంలో బొమ్మలను ప్రదర్శించాలి. ఇందుకు స్థానిక పీఎంర్‌సీలో 10 వరకు బ్లాకులను విభజించి సుందరంగా తీర్చిదిద్ది అందులో ప్రదర్శనకు ప్రతిపాదనలు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఏ గదిలో కూడా పూర్తిస్థాయిలో గిరిజన సంస్కృతి, ఆచార సంప్రదాయలు ఉట్టిపడే బొమ్మలు కనిపించన దాఖలాలు లే వు. అరకు, శ్రీశైలం, భువనేశ్వర్ వంటి చోట మ్యూజియాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఆ స్థాయిలో మ్యూజియం ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. అయితే పూర్తిస్థాయిలో పూర్తికాకుండానే ప్రారంభానికి సిద్ధమవడం విశేషం.
సీతంపేట: ఆధునికీకరించిన సీతంపేట ఏరియా ఆస్పత్రిని మంత్రి సంధ్యారాణి మంగళవారం ప్రారంభించనున్నారు. గిరిజన ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 30 పడకల ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దేందుకు ముందడుగు వేసింది. నాటి ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ప్రత్యేక చొరవతో యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం నుంచి రూ.19.07 కోట్లు మంజూరు చేయించారు. దశల వారీగా 80 శాతం పనులు పూర్తయిన విషయం తెలిసిందే. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తి చేసింది.
ౖపైపె మెరుగులతో మ్యూజియం..!
ౖపైపె మెరుగులతో మ్యూజియం..!


