వైభవంగా పెదపోలమాంబ ప్రధానోత్సవం
● నేడు అనుపోత్సవం
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబరపోలమాంబ అమ్మవారి మేనత్త, పెదపోలమాంబ అమ్మవారి ప్రధానోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. చదురుగుడిలో అమ్మవారి ఘటాలకు బంగారుపూత పూసి, పూజలు నిర్వహించారు. చదురుగుడినుంచి అమ్మవారి ఘటాలను మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తులు జయజయధ్వానాల మధ్య శంబర గ్రామంలోని ప్రధానరహదారి వద్ద నున్న అమ్మవారి గద్దెవద్దకు తీసుకువచ్చారు. ముందుగా రెవిన్నాయుడు, పూడి,కరణం, కుప్పిలి వారింటికి ఆనవాయితీ ప్రకారం అమ్మవారి ఘటాలు చేరుకున్నాయి. అక్కడ పూజలు జరిపించిన అనంతరం గ్రామంలోని అన్నివీధుల్లో అమ్మవారి ఘటాలకు తిరువీధి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 9.30గంటల సమయానికి అమ్మవారి గద్దె వద్దకు అమ్మవారి ఘటాలు చేరుకుంటాయి. గద్దెవద్ద అమ్మవారికి ఉయ్యాల కంబాల కార్యక్రమం నిర్వహించి, అనంతరం అనుపోత్సవం చేపడతారు. శంబరపోలమాంబ అమ్మవారిని గ్రామంలోకి తెచ్చేందుకు బుధవారం చాటింపు వేస్తారు. కార్యక్రమంలో ఈవో బి.శ్రీనివాస్, ట్రస్ట్‌బోర్డుచైర్మన్ తిరుపతిరావు, సభ్యులు, మాజీట్రస్ట్‌బోర్డు చైర్మన్లు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
వైభవంగా పెదపోలమాంబ ప్రధానోత్సవం
వైభవంగా పెదపోలమాంబ ప్రధానోత్సవం


