చిన్నచూపు
పార్వతీపురంటౌన్/కొమరాడ: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై న తమను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మండిపడుతున్నారు. ఈనెల 2న ప్రారంభించిన పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీలో కనీసం తమకు సమాచారం ఇవ్వకుండా ప్రోటోకాల్ పాటించకుండా పాస్‌పుస్తకాల పంపిణీ జిల్లా వ్యాప్తంగా చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో వారి పార్టీకి అనుకూలంగా ఉన్నవారితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నియమించిన నామినేటెడ్ పదవులు ఉన్నవారి చేతుల మీదుగా పాస్‌పుస్తకాల పంపిణీ చేపడుతున్నారని తమకు కనీసం ఎటువంటి సమాచారం ఇవ్వకుండా గ్రామాల్లో పంపిణీ చేయడంతో తమకంటూ విలువ లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాల్లో చిచ్చు పెట్టేలా..
తాము ఎన్నికల్లో గెలిచి సర్పంచ్‌లు, ఎంపీటీసీలుగా ఉన్నప్పటికీ కేవలం టీడీపీ నాయకులతోనే పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేయించడంపై ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికై న తమకు విలువ లేదా? అని మండిపడుతున్నారు. జిల్లాలోని 15 మండలాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఉన్నప్పటికీ కేవలం నామినేటెడ్ పదవులు పొందిన వారితో పంపిణీ చేయడంతో కొన్ని గ్రామాల్లో గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ జీఓలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో గ్రామాల్లోని నాయకుల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా కార్యక్రమాల్లో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికై న వారందరికి ప్రోటోకాల్ కల్పించి అందరినీ ఒకే విధంగా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
సర్పంచ్‌లు, ఎంపీటీసీలపై ప్రభుత్వం వివక్ష
పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీలో అటకెక్కిన ప్రోటోకాల్
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై న వారిపై నిర్లక్ష్యం
నామినేటెడ్ పదవులు పొందినవారితో పాస్‌పుస్తకాల పంపిణీ
మమ్మల్ని చిన్నచూపు చూసినట్లే
ఈనెల 2వ తేదీన పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ విషయంలో కనీసం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కొమరాడ మండలం కోనవలస గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి కనీసం పిలవకుండా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నిక కాని టీడీపీ నాయకులతో పంపిణీ చేపట్టారు. ఇటువంటి చర్యలు చంద్రబాబు ప్రభుత్వానికి ఆనవాయితీగా వస్తోంది. రాజకీయాలు చేయకుండా మాకు సముచిత స్థానం కల్పించాలి. చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ రాచరిక పాలనను ప్రోత్సహిస్తోంది. కేండ్రిక అన్నపూర్ణ,
వైస్ ఎంపీపీ, కొమరాడ మండలం
ప్రజాస్వామ్య హక్కుల కాలరాత
చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజా స్వామ్య హక్కులను కాలరాయడమే పనిగా పెట్టుకుంది. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలను పట్టించుకోకుండా నా మినేటెడ్ పదవులు ఉన్నవారికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం సిగ్గుచేటు. ప్రజలతో ఎన్నికై న వారిని ప్రభుత్వం చిన్నచూపు చూడడం సరైన పద్ధతి కాదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో తమకంటూ ప్రోటోకాల్ పాటించకుండా టీడీపీ నాయకులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఆవేదనకు గురిచేస్తోంది. ప్రభుత్వం ఈ వైఖరిని మానుకోవాలి.
–మజ్జి శోభారాణి, ఎంపీపీ, పార్వతీపురం
చిన్నచూపు
చిన్నచూపు


