అగ్నిమాపక ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ
విజయనగరం క్రైమ్: రాష్ట్ర అగ్నిమాపక శాఖ ఉద్యోగుల సంఘం డైరీని హోం మంత్రి అనిత ఏపీ రాష్ట్ర సచివాలయంలో ఆవిష్కరించినట్లు విజయనగరం జిల్లా అగ్నిమాపక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, అగ్నిమాపక అధికారి రమేష్ బుధవారం తెలిపారు. రాష్ట్ర అగ్నిమాపక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులు డైరీ ఆవిష్కరణలో పాల్గొన్నారన్నారు. ఈ సందర్భంగా ఫైర్ సర్వీస్ సిబ్బందికి పోలీస్ సిబ్బంది మాదిరిగా ఉద్యోగ నియామకంలో చిల్డ్రన్స్ కోటా ఇప్పించాలని హోం మంత్రి అనితకు విజ్ఞప్తి చేశామన్నారు. అలాగే సిబ్బంది సరెండర్ లీవుల మంజూరు విషయంలో మంత్రిని కోరామని తెలిపారు. ఇందుకు మంత్రి అనిత సానుకూలంగా స్పందించారని జిల్లా అగ్నిమాపక అధికారి రమేష్ తెలియజేశారు.


